కాంట్రాక్ట్ రద్దు చేయాలని ఆదేశం
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: మండలంలోని జొన్నవాడ కామాక్షితాయి ఆలయం వద్దకెళ్లే వాహ నాల నుంచి అక్రమ వసూళ్లపై బుచ్చిరెడ్డిపాళెం ఇన్‌చార్జి ఎంపీడీఓ మంజులమ్మ తనిఖీలు చేప ట్టారు. గురువారం సాక్షిలో ‘జొన్నవాడలో అనధికార వసూళ్లు’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో ఆలయం వద్ద తనిఖీ చేపట్టామని ఆమె తెలిపారు. తన వాహనానికి కూడా పంచాయతీ ముద్ర, ఎలాంటి సంతకం లేకుండా రసీదు ఇచ్చినట్లు చెప్పారు. కనీసం వాహన నంబర్ కూడా నమోదు చేయడం లేదన్నారు. నగదు వసూలు చేస్తున్న సదరు వ్యక్తుల కాంట్రాక్ట్ రద్దు చేయాలని జొన్నవాడ పంచాయతీ సెక్రటరీ కావేరిని ఆదేశించారు. వారి దగ్గర ఉన్న రసీదులను స్వాధీనం చేసుకున్నారు. అనధికారికంగా వసూళ్లకు పాల్పడితే సహించబోమన్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు.
కాంట్రాక్ట్ రద్దు చేయాలని ఆదేశం


