వైఎస్సార్‌సీపీ నేతలపై కూటమి కక్ష సాధింపు
వెంకటాచలం: కూటమి ప్రభు త్వం వైఎస్సార్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర పీఏసీ సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో డీసీఎంఎస్ మాజీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి వీరి చలపతిరావు గురువారం వెంకటాచలం మండలంలోని చెముడుగుంట వద్దనున్న జిల్లా సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ప్రసన్న ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చలపతిరావుపై అక్రమంగా కేసులు మోపిందన్నారు. కోర్టు బెయిల్ ఇవ్వడంతో 33 రోజుల తర్వాత చలపతిరావు విడుదలైనట్లు చెప్పారు. చలపతికి వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు.


