జలాశయాన్ని పరిశీలించిన ఎస్‌ఈ, తహసీల్దార్
సోమశిల: సోమశిల జలాశయాన్ని ఎస్‌ఈ వెంకటరమణారెడ్డి, తహసీల్దార్ జయవర్ధన్ బుధవారం పరిశీలించారు. కండలేరు పూర్తి సామర్థ్యానికి చేరుకోనున్న నేపథ్యంలో కండలేరు వరద కాలువకు నీటి విడుదల నిలుపుదల చేసేందుకు ఎస్‌ఈ జలాశయానికి వచ్చారు. అనంతరం ప్రాజెక్ట్ క్రస్ట్‌గేట్లను పరిశీలించారు. ఎగువ నుంచి వస్తున్న వరదపై ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. తహసీల్దారు మాట్లాడుతూ పైతట్టు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల దృష్ట్యా జలాశయానికి వరద వచ్చే అవకాశం ఉన్నందున పెన్నా పరీవాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.


