అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్
వర్షాలపై కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం ఆర్డీఓలు, రెవెన్యూ, స్పెషల్ ఆఫీసర్లతో బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాయుగుండం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి కనీస సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులెవరూ సెలవులు పెట్టేందుకు వీలులేదని ఆదేశించారు. ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తమ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు, వాగులు వంకలు పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ 0861–2331261, 79955 76699 నంబర్లకు ప్రజలు అత్యవసరం పరిస్థితుల్లో సమాచారాన్ని అందించాలని కోరారు.


