
మోటార్‌బైక్‌పై వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
అల్లూరు: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన ఘటన అల్లూరు గోదాముల వద్ద మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. అల్లూరు పురిణి మందిరం గ్రామానికి చెందిన నొంగులూరు శ్రీహరి (28) ఓ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతను బైక్‌పై మోపూర్ నుంచి అల్లూరుకు వస్తున్నాడు. ఈ క్రమంలో గోదాముల నుంచి ప్రధాన రహదారి అల్లూ రు వైపునకు తిరుగుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఇంకా ఎదురుగా నెల్లూరు వైపు వెళ్తున్న మరో బైక్‌ను ఢీకొని శ్రీహరి రోడ్డుపై పడి తలకు తీవ్రగాయమై మృతిచెందాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అల్లూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్సై శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.
మద్యం దుకాణంలో చోరీ
రాపూరు: కోటూరుపాడు మార్గంలో ఉన్న మద్యం దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీ చేశారు. సోమవారం రాత్రి నిర్వాహకులు దుకాణానికి తాళాలు వేసి వెళ్లారు. మంగళవారం ఉదయం షాపు తెరిచేందుకు రాగా తాళాలు పగులగొట్టి ఉన్నాయి. లోపలికెళ్లి పరిశీలించి 4 కేసుల 29 మద్యం బాటిళ్లు, రూ.11,800 నగదు చోరీ చేసినట్లు గుర్తించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.