
డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కార్యవర్గ ఎన్నిక
నెల్లూరు(అర్బన్): ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, అమరావతి రాష్ట్ర సర్వసభ్య సమావేశాన్ని ధనలక్ష్మీపురంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ రాష్ట్ర మహిళా విభాగ గౌరవాధ్యక్షురాలిగా సరోజిని, గౌరవ సలహాదారుగా లీలాకృష్ణ ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్ష, జనరల్ సెక్రటరీలుగా వెంకటరమణ, చేజర్ల సుధాకర్‌రావు, కోశాధికారిగా హరిప్రసాద్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్, ఉపాధ్యక్షులుగా శివరామకృష్ణ, సయ్యద్ బేగం, మహ్మద్ రఫీ, వెంకటేశ్వర్లు, రాజేంద్రకుమార్, విజయలక్ష్మి, సాదు వెంకటేశ్వర్లు, రమణ, వెంకటగిరిబాబు, భాస్కర్, కృష్ణమోహన్, మంగమ్మను ఎన్నుకున్నారు. పబ్లిసిటీ సెక్రటరీగా టాటాబాయ్, జాయింట్ సెక్రటరీలుగా అనూరాధ, పద్మావతి, సుమతి, సుబ్బలక్ష్మి, సీతామహలక్ష్మి, లక్ష్మీకుమారి, ధనలక్ష్మి, సునీత, మంగ, విజయకుమార్, అనిల్ ప్రేమ్‌కుమార్, తులసీదేవి ఎన్నికయ్యారు. అనంతరం వీరు ప్రమాణం చేశారు.