అధికారులకు రాజకీయాలెందుకు? | - | Sakshi
Sakshi News home page

అధికారులకు రాజకీయాలెందుకు?

Jul 6 2025 6:33 AM | Updated on Jul 6 2025 6:33 AM

అధికారులకు రాజకీయాలెందుకు?

అధికారులకు రాజకీయాలెందుకు?

నెల్లూరు (పొగతోట): ‘ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి.. అధికారులు మాత్రం సర్వీసులోనే ఉంటారు. అధికారులకు రాజకీయాలెందుకంటూ’ జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ ఎంపీడీఓలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో పంచాయతీ పురోగతి సూచిక కార్యక్రమంపై ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ మాట్లాడారు. అధికారులు నిబంధనలు ప్రొటోకాల్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు జెడ్పీ చైర్‌పర్సన్‌, జెడ్పీటీసీలను, ఎంపీపీలను ఆహ్వానించాలన్నారు. ప్రొటోకాల్‌ విషయంలో అంత ఇబ్బంది పడేటట్లు అయితే రిజైన్‌ చేసి ఇంట్లో కూర్చోవాలని సూచించారు. ఇకపై ప్రొటోకాల్‌ విషయంలో ఘటన పునరావృతమైతే సహించేది లేదంటూ హెచ్చరించారు. ప్రస్తుత, భవిష్యత్‌ తరాల శ్రేయస్సు కోసం సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను రూపొందించుకుని 2030 నాటికి వాటిని సాధించు కోవాలన్నారు. ఈ లక్ష్య సాధన కోసం కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో పటిష్టమైన వ్యూహాన్ని రూపొందించిందన్నారు. పేదరికం లేని మెరుగైన జీవనోపాధి, ఆరోగ్య వంతమైన, స్వయం సమృద్ధిగల మౌలిక సదుపాయాలు, సామాజిక సురక్షితమైన, సుపరిపాలన, మహిళా స్నేహ పూర్వకమైన గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు క్షేత్ర స్థాయిలో అమలు చేయాలన్నారు. ప్రతి పంచాయతీలో 9 కార్యక్రమాల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకుని, సంపూర్ణంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని పంచాయతీలను ఏ–గ్రేడ్‌లోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎంపీడీఓలు మండల సాధారణ నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులను ప్రజా ప్రతినిధులకు విడుదల చేయాలన్నారు. ఆత్మకూరు ఘటనకు సంబంధించి ఇంత వరకు నివేదికలు అందలేదన్నారు. నివేదికలను త్వరగా ఇవ్వాలని ఆత్మకూరు ఎంపీడీఓకు సూచించారు.

● జెడ్పీ సీఈఓ మోహన్‌రావు మాట్లాడుతూ పంచాయతీల అభివృద్ధికి సంబంధించి జిల్లా స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నెల 9వ తేదీన శిక్షణకు హాజరైన అధికారులు మండల స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు ఇవ్వాలని సూచించారు. లైన్‌ డిపార్ట్‌మెంట్‌లను కో ఆర్డినేషన్‌ చేసుకుని పంచాయతీలకు అవార్డులు వచ్చేలు ప్రణాళికలు రూపొందించాలన్నారు. జీపీడీపీ యాక్షన్‌ ప్లాన్లు పేపర్లలోనే జరుగుతున్నాయని, క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. పంచాయతీల అభివృద్ధికి సంబంధించి 147 అంశాలను పొందుపరిచారన్నారు. జరిగిన అభివృద్ధికి సంబంధించి పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ వేణుగోపాల్‌, ట్రైనర్‌ ప్రసాద్‌, ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు.

ఇబ్బందిగా ఉంటే రిజైన్‌ చేసి

ఇంట్లో కూర్చోండి

జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement