విద్యుదాఘాతానికి గురై..
● వ్యక్తి మృతి
మనుబోలు: విద్యుతాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండలంలోని మడమనూరు గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన కొణితం మస్తానయ్య (40) ఆదివారం అర్ధరాత్రి నిద్రలేచి మూత్రవిసర్జన కోసం ఆరుబయటకు వెళ్లాడు. అప్పటికే గాలికి అక్కడ కరెంట్ తీగ తెగిపడి ఉంది. దీనిని మస్తానయ్య గమనించలేదు. దీంతో విద్యుత్ తీగ కాలికి తగిలి షాక్‌కు గురై కుప్పకూలి చనిపోయాడు. సమాచారం అందుకున్న ఎస్సై శివరాకేష్ సోమవారం మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
కాలువలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి
నెల్లూరు(క్రైమ్): నెల్లూరు బృందావనంలోని యూనియన్ బ్యాంక్ సమీపంలో ఉన్న కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెంది ఉండటాన్ని సోమవారం స్థానికులు గుర్తించి సంతపేట పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో మృతదేహాన్ని వెలికితీసి జీజీహెచ్ మార్చురికి తరలించారు. 46వ డివిజన్ వీఆర్వో శివ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతుడి వివరాలు తెలిసిన వారు సంతపేట పోలీస్‌స్టేషన్, 94407 00017 నంబర్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
జెడ్పీ సీఈఓ బదిలీ
నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్ సీఈఓ విద్యారమ బదిలీ అయ్యారు. శ్రీకాళహస్తిలోని శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్‌గా నియమితులయ్యారు. బుచ్చిరెడ్డిపాళెం ఎంపీడీఓ శ్రీహరి వెస్ట్ గోదావరి సీఈఓగా బదిలీ అయ్యారు.
విద్యుదాఘాతానికి గురై..


