గంజాయి విక్రయిస్తుండగా..
● ముగ్గురు వ్యక్తుల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): గంజాయిని విక్రయించేందుకు కారులో సిద్ధంగా ఉన్న ముగ్గురు నిందితులను నెల్లూరు వేదాయపాళెం పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం వేదాయపాళెం పోలీస్‌స్టేషన్‌లో స్థానిక ఇన్‌స్పెక్టర్ కె.శ్రీనివాసరావు నిందితుల వివరాలను వెల్లడించారు. ఆదివారం సాయంత్రం తల్పగిరి కాలనీలోని సాయిబాబా మందిరం సమీపంలో గంజాయి విక్రయాలు సాగుతున్నాయని ఇన్‌స్పెక్టర్‌కు పక్కా సమాచారం అందింది. ఆయన తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని కారులో గంజాయిని విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం కానూరు రాజుపాళేనికి చెందిన ఈ.సాయికిరణ్, నెల్లూరు నవాబుపేట రామచంద్రాపురానికి చెందిన దిలీప్, తిరుపతి జిల్లా వెంకటగిరి నెహ్రూనగర్‌కు చెందిన జనార్దన్‌ను అరెస్ట్ చేశారు. 400 గ్రాముల గంజాయి, కారును స్వాధీనం చేసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.


