2.45 లక్షల మంది రైతులకు మొండి చేయి..
జిల్లాలో వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం 2.45 లక్షల మంది రైతులు, కౌలు రైతులు ఉన్నారు. గత ప్రభుత్వం అందరికీ కలిపి రైతు భరోసా పథకాన్ని అమలు చేసింది. కూటమి ప్రభుత్వం వీరికి రూ.20 వేల వంతున ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ లెక్కన వీరికి ఏడాదికి రూ.430 కోట్లు చెల్లించాల్సి ఉంది. గతేడాది పంగనామాలు పెట్టారు. ఈ ఏడాదైనా ఇస్తారంటే.. నమ్మకం కనిపించడం లేదు. ఈ పథకాన్ని అమలు చేయడానికి ఇంత వరకు వ్యవసాయశాఖకు ఎలాంటి విధివిధానాలు నిర్ణయించలేదు. అదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏటా మే నెలలోనే ఈ పథకం ద్వారా సాయం అందించింది.


