ఘనంగా జగనన్న పుట్టినరోజు
సూళ్లూరుపేట రూరల్: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ చైర్మన్ దబ్బల శ్రీమంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర యువజన విభాగం జాయింట్ సెక్రటరీ వేనాటి సుమంత్‌రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ చేసి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పంచిపెట్టారు. గాంధీ విగ్రహం వద్ద అన్నదానం చేశారు. తడ ఎంపీపీ కె.రఘు తదితరులు పాల్గొన్నారు.


