175 నియోజకవర్గాలకు స్కూటర్ యాత్ర
నెల్లూరురూరల్: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని జలదంకి మండలం అన్నవరం గ్రామానికి చెందిన అడవికొట్టు రాజు 175 నియోజకవర్గాలకు స్కూటర్ యాత్రను ఆదివారం ప్రారంభించారు. ఈ మేరకు నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయం వద్ద మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి అంటే చాలా అభిమానం అని, పేదల కోసం ఆయన ఎంతో చేశారని, ఆ అభిమానంతో నేను స్కూటర్ యాత్ర చేస్తున్నానని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్ల తాను ఎంతో లబ్ధి పొందానని, అంతకన్నా ఎక్కువ పథకాలు జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు ఇచ్చారని తెలియజేశారు.


