25 కిలోల బస్తా.. 22 కిలోలే.. | - | Sakshi
Sakshi News home page

25 కిలోల బస్తా.. 22 కిలోలే..

Dec 22 2025 1:55 AM | Updated on Dec 22 2025 1:55 AM

25 కి

25 కిలోల బస్తా.. 22 కిలోలే..

దుకాణాలపై విజిలెన్స్‌ దాడులు

ముత్తుకూరు(పొదలకూరు): మండల కేంద్రమైన ముత్తుకూరులో వ్యాపార దుకాణాలపై ఆదివారం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌, లీగల్‌ మెట్రాలజీ శాఖ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. వ్యాపారులు వస్తువుల అమ్మకాల్లో జరుగుతున్న మోసాలపై ఫిర్యాదు అందడంతో దాడులు చేశారు. 25 కిలోల బియ్యం బస్తా 22 కిలోలే ఉండడంపై అధికారులు మొత్తం తొమ్మిది కేసులు నమోదు చేశారు. తూనికలు కొలతల్లో తేడాలు ఉంటే వినియోగదారులు తమ దృష్టికి తీసుకు రావాల్సిందిగా సూచించారు. ఈ దాడుల్లో శ్రీహరిరావు, వెంకటరెడ్డి, కృష్ణప్రసాద్‌, రియాజ్‌అహ్మద్‌ పాల్గొన్నారు.

ఉత్సాహంగా సైకిల్‌ ర్యాలీ

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో ఆదివారం ఉత్సాహంగా సైకిల్‌ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్‌డీఓ ఎం.పాండురంగారావు మాట్లాడుతూ ఫిట్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆదివారం సైకిల్‌ ర్యాలీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు నిర్వహించిన ర్యాలీలో విక్రమ సింహపురి యూనివర్సిటీ స్పోర్ట్స్‌ బోర్డు సెక్రటరీ వెంకటరాయులు, మాజీ డీఎస్‌డీఓ కె.యతిరాజ్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రొఫెసర్‌ ఎ.ప్రవీణ్‌, కోచ్‌లు, వాకర్స్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.

దళితులపై పోలీసుల దాడులు దారుణం

నెల్లూరురూరల్‌: నగరంలోని 12వ డివిజన్‌లో శనివారం రాత్రి జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఫ్లెక్సీలు కట్టినందుకు దళితుడు అని కూడా చూడకుండా పోలీసులు తనను దారుణంగా కొట్టారని వైఎస్సార్‌సీపీ నేత గాలి రాజేష్‌ తెలిపారు. నెల్లూరు నగరంలోని జిల్లా జర్నలిస్ట్‌ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాంతంలో జగన్‌మోహన్‌రెడ్డి ఫ్లెక్సీలు కడితే మరిన్ని దెబ్బలు తప్పవని పోలీసులు బెదిరించడం ఘోరమన్నారు. కూటమి ప్రభుత్వంలో దళితులను టార్గెట్‌ చేసి కొడుతున్నారని వాపోయారు. రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఫ్లెక్సీలు కడితే తప్పేమిటని ప్రశ్నించారు. దీనిపై పోలీస్‌ ఉన్నతాధికారులు విచారణ చేసి తగిన న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేత శ్యామ్‌ పాల్గొన్నారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా బీద రవిచంద్ర

నెల్లూరు సిటీ: టీడీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ బీద రవిచంద్రను నియమిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ఆదివారం ప్రకటించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేజర్ల వెంకటేశ్వరరెడ్డిని నియమించారు.

ఐక్య పోరాటాలకు సిద్ధం కండి

నెల్లూరు(వీఆర్సీసెంటర్‌): న్యాయమైన కొర్కెల సాధన కోసం విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు, విద్యుత్‌ మీటర్‌ రీడర్స్‌ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శివారెడ్డి పిలుపునిచ్చారు. సంతపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో విద్యుత్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు, మీటర్‌ రీడర్స్‌ల విస్తృత స్థాయి సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుతో విద్యుత్‌ సంస్థకు తోడ్పాటునందిస్తున్న మీటర్‌ రీడర్స్‌ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని, వీరికి పీస్‌రేటును రద్దు చేసి కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రభుత్వాన్ని, విద్యుత్‌ యాజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో యూనియన్‌ నాయకులు శంకర్‌కిశోర్‌, రామకృష్ణ, కృష్ణ, నవీన్‌, సాయిరాం తదితరులు పాల్గొన్నారు.

నిమ్మధరలు(కిలో)

పెద్దవి: రూ.15

సన్నవి: రూ.10

పండ్లు: రూ.3

25 కిలోల బస్తా.. 22 కిలోలే.. 1
1/4

25 కిలోల బస్తా.. 22 కిలోలే..

25 కిలోల బస్తా.. 22 కిలోలే.. 2
2/4

25 కిలోల బస్తా.. 22 కిలోలే..

25 కిలోల బస్తా.. 22 కిలోలే.. 3
3/4

25 కిలోల బస్తా.. 22 కిలోలే..

25 కిలోల బస్తా.. 22 కిలోలే.. 4
4/4

25 కిలోల బస్తా.. 22 కిలోలే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement