యాదవులు ఆదర్శంగా నిలవాలి | - | Sakshi
Sakshi News home page

యాదవులు ఆదర్శంగా నిలవాలి

Dec 22 2025 1:55 AM | Updated on Dec 22 2025 1:55 AM

యాదవులు ఆదర్శంగా నిలవాలి

యాదవులు ఆదర్శంగా నిలవాలి

మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): యాదవులు స్వశక్తితో ఎదిగి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి మిగిలిన వారికి ఆదర్శంగా నిలవాలని మాజీ మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. కొత్తూరులోని యాదవ ఎంప్లాయీస్‌ సొసైటీ భవనంలో ఎస్‌ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా అనిల్‌ హాజరై, మాట్లాడారు. ఉద్యోగులందరూ వారి పరిధిలో ప్రతిభ గత పేద విద్యార్థులను గుర్తించి వారి విద్యాభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని ఆకాంక్షించారు. ఎస్‌ వ్యవస్థాపకుడు జి.శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ట్రెజరీల పరిధిలో స్థానిక నాయకత్వం బలంగా ఉండబట్టే ఎస్‌ నిర్మాణం పటిష్టంగా ఉందని, రానున్న కాలంలో ఇలాంటి సహాయ సహకారాలు ఉండాలని ఆకాంక్షించారు. మరో వ్యవస్థాపకుడు కె.మల్లికార్జున మాట్లాడుతూ జిల్లాలోని పేద విద్యార్థులకు ఎస్‌ జిల్లా కార్యాలయంలో ఉచిత వసతి ఏర్పాటు చేశామని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డి.యుగంధర్‌ మాట్లాడుతూ అన్ని విభాగాల ఉద్యోగులు పరస్పరం సహకరించుకోవాలని కోరారు. జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ వెంగయ్య మాట్లాడుతూ ఎస్‌ను పటిష్టం చేయడానికి ప్రతి ఉద్యోగి సహకరించాలని కోరారు. ఉపాధ్యక్షుడు పి.రత్నం మాట్లాడుతూ ఎస్‌ సభ్యుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో 250 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్‌, శివప్రసాద్‌, డి.వెంకటేశ్వర్లు, జి.బాబు, మహిళా విభాగం అధ్యక్ష, కార్యదర్శులు కళావతి, భూలక్ష్మి, లక్ష్మీనారాయణ, హరికృష్ణ, ఎం.శ్రీనివాసులు, శేషాద్రి, ప్రభాకర్‌, జి.వెంకటేశ్వర్లు, బి.దయాకర్‌, డి.వెంగయ్య, కె.కనకరాజు, జనార్దన్‌, ఎం.శ్రీనివాసులు, ఎన్‌.బాలసుబ్రహ్మణ్యం, పి.ప్రసాద్‌, ఓబుల్‌రాజు, డి.పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement