వైకుంఠనాథునిగా రంగడి దర్శనం
నెల్లూరు(బృందావనం): రంగనాయకులపేటలోని తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో అధ్యయనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. పగల్‌పత్తు ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం స్వామివారు వైకుంఠనాథ అలంకారంలో దర్శనమిచ్చారు. ఉభయదేవేరులతో సర్వాలంకార శోభితంగా కొలువైన తల్పగిరి రంగనాథుడిని భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతగా దివంగత నాతా నరసింహులుశెట్టి దత్తపుత్రుడు వెంకటేశ్వర్లు వ్యవహరించారు. కార్యక్రమాలను ఈఓ ఆళ్ల శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు.


