లక్షల గొంతుకలై నిలదీస్తాం | - | Sakshi
Sakshi News home page

లక్షల గొంతుకలై నిలదీస్తాం

Jun 2 2025 10:22 AM | Updated on Jun 2 2025 11:09 AM

లక్షల గొంతుకలై నిలదీస్తాం

లక్షల గొంతుకలై నిలదీస్తాం

మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిపై అక్రమ కేసులా?

ముస్లిం మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి ఖలీల్‌ అహ్మద్‌

నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): జిల్లాలో ప్రజల వాణిగా మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వినిపిస్తున్న గొంతును అక్రమ అరెస్ట్‌లతో నొక్కేస్తే.. లక్షల గొంతుకలై ప్రజలు నిలదీస్తారని, గర్జిస్తారని ముస్లిం మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి ఖలీల్‌ అహ్మద్‌ చెప్పారు. అక్రమ అరెస్ట్‌లతో ప్రశ్నించే గళాన్ని నొక్కాలనుకోవడం అమాయకత్వమే అవుతుందన్నారు. కాకాణి అక్రమ అరెస్ట్‌ను జిల్లా వైఎస్సార్‌సీపీ మైనారిటీ నాయకులు ముక్తకంఠంతో ఖండించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఖలీల్‌ అహ్మద్‌ మైనారిటీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో కూటమి దాష్టీకాలపై ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా అక్రమ అరెస్ట్‌లు చేయాలనుకుంటే అది సాధ్యం కాదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాట పటిమను నరనరాన జీర్ణించుకున్న పార్టీ శ్రేణులు ఎటువంటి పోరాటాలకైనా సిద్ధంగానే ఉన్నారన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉందని, కాకాణి తప్పకుండా క్లీన్‌చిట్‌తో బయటకు వస్తారన్నారు.

సోమిరెడ్డి అరాచకాలను ప్రశ్నిస్తున్నారనే..
 

వైఎస్సార్‌సీపీ ఇంటలెక్చువల్‌ ఫోరం రాష్ట్ర అధికార ప్రతినిధి సమీర్‌ఖాన్‌ మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి అక్రమాలను, అరాచకాలను ప్రశ్నించినందుకే కాకాణిని అక్రమ అరెస్ట్‌ చేశారన్నా రు. జిల్లా రాజకీయాల్లో ఎన్నో ప్రముఖ కుటుంబాలు రాజకీయం చేసినప్పటికీ ఇటు వంటి నీచ రాజకీయా లు ఎన్నడూ చూడలేదని, కాకాణి అక్రమ అరెస్ట్‌ను ఖండించే ప్రతి గొంతు నొక్కాలని చూస్తున్నారన్నారు.

● ముస్లిం మైనారిటీ నాయకులు అబ్దుల్‌ మస్తాన్‌ మాట్లాడుతూ కాకాణి గోవర్ధన్‌ రెడ్డి ప్రజల మనిషి. ఎవరికి ఎటువంటి కష్టం నేనున్నానని ముందు నిలబడే వ్యక్తి అన్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిది చాలా నీచ చరిత్ర అని, 1983లో ఎన్టీఆర్‌ పంచన చేరి పదవులు పొందిన సోమిరెడ్డి తర్వాత కాలంలో చంద్రబాబు పంచన చేరి ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తుల్లో సోమిరెడ్డి ఒకరన్నారు.

● కార్పొరేటర్‌ సత్తార్‌ మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులు నొక్కాలని ఇటువంటి అక్రమ కేసులు పెడుతున్నారు. కలెక్టరేట్‌ వద్ద జరిగిన కార్యక్రమానికి తాను వెళ్లకపోయినా నా మీద కేసు పెట్టడం జరిగిందని, ఆ సమయానికి నేను ఆరోగ్యం బాలేక ఇంట్లోనే ఉన్నానన్నారు.

● ముస్లిం మైనార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్‌ సిద్ధిక్‌ మాట్లాడుతూ కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ముస్లిం వర్గాలతోపాటు అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉందన్నారు. ఆయన అక్రమ అరెస్ట్‌ను అందరూ ఖండిస్తున్నారన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ ముస్లిం మైనారిటీ నేతలు మస్తాన్‌, జహీద్‌, ఇబ్రహీం, మీరా, షఫీ తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement