అట్టహాసంగా సాఫ్ట్‌బాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అట్టహాసంగా సాఫ్ట్‌బాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

May 1 2025 12:09 AM | Updated on May 1 2025 12:09 AM

అట్టహ

అట్టహాసంగా సాఫ్ట్‌బాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

కోలాహలంగా మారిన

వీఎస్‌యూ ప్రాంగణం

వెంకటాచలం: మండలంలోని కాకుటూరు వద్దనున్న విక్రమ సింహపురి యూనివర్సిటీ (వీఎస్‌యూ)లో జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్‌ టోర్నమెంట్‌ బుధవారం అట్టహాసంగా మొదలైంది. ఈనెల 3వ తేదీ వరకు జరిగే మహిళల పోటీలకు వివిధ రాష్ట్రాల నుంచి 95 జట్లు వీఎస్‌యూకు చేరుకోవడంతో ప్రాంగణం కోలాహలంగా మారింది. నాలుగు పూల్స్‌గా విభజించి ప్రారంభించారు. పూల్‌–ఏలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ, స్వర్ణజిత్‌ గుజరాత్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీల జట్ల మధ్య తొలి మ్యాచ్‌తో టోర్నమెంట్‌ను ప్రారంభించారు. వీసీ అల్లం శ్రీనివాసరావు, ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.సునీత క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. సాయంత్రం 6 గంటల వరకు జరిగిన మ్యాచ్‌లు పోటాపోటీగా సాగాయి. టోర్నమెంట్‌ ప్రారంభ కార్యక్రమంలో వీసీ, ఇంకా సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ పాల్గొన్నారు. వీసీ మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములను ఒకేలా తీసుకోవాలని సూచించారు. భవిష్యత్‌లో మరిన్ని అంతర్‌ విశ్వవిద్యాలయ టోర్నమెంట్లను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు.

తొలిరోజు ఇలా..

తొలిరోజు 20 మ్యాచ్‌లు జరిగాయి. మేవార్‌ యూనివర్సిటీ (రాజస్థాన్‌)పై శివాజీ యూనివర్సిటీ (కొల్హాపూర్‌), శ్రీ కుశల్‌దాస్‌ యూనివర్సిటీ (హనుమన్‌ఘర్‌)పై తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం, రాజా మహేంద్రప్రతాప్‌సింగ్‌ స్టేట్‌ యూనివర్సిటీ (అలీఘర్‌)పై పుణ్యాష్‌లోక్‌ అహల్యాదేవి హోల్కర్‌ యూనివర్సిటీ (సోలాపూర్‌), కన్నూర్‌ యూనివర్సిటీ(కన్నూర్‌)పై యూనివర్సిటీ ఆఫ్‌ కేరళ (తిరువనంతపురం), చౌదరి చరణ్‌సింగ్‌ యూనివర్సిటీ (మేరట్‌)పై బెంగళూరు యూనివర్సిటీ, అన్నా యూనివర్సిటీ (చైన్నె)పై మహాత్మాగాంధీ యూనివర్సిటీ (నల్గొండ), హేమచంద్రాచార్య నార్త్‌ గుజరాత్‌ యూనివర్సిటీ (పాఠన్‌)పై, విక్రమ్‌ యూనివర్సిటీ (ఉజ్జయిన్‌), జేఎన్‌టీయూ (హైదరాబాద్‌)పై బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ (ఆగ్రా), ఎస్‌ఓఏ డీమ్డ్‌ యూనివర్సిటీ (ఒడిశా)పై బరక్‌తుల్లా యూనివర్సిటీ (భోపాల్‌), ఏకలవ్య యూనివర్సిటీపై ఆంధ్రా యూనివర్సిటీ (విశాఖపట్నం), మోహన్‌లాల్‌ సుఖాడియా యూనివర్సిటీ (ఉదయ్‌పూర్‌)పై మంగళూరు యూనివర్సిటీ, మాధవ్‌ యూనివర్సిటీ (రాజస్థాన్‌)పై షహీద్‌ మహేంద్ర కర్మ విశ్వవిద్యాలయం (బస్తా ర్‌), రాజీవ్‌గాంధీ ప్రౌద్యోగికి విశ్వవిద్యాలయం (భోపాల్‌)పై సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం (రాజ్‌కోట్‌), రాజ్‌రిషి భారత్రిహరి మత్స్య యూనివర్సిటీ (ఆల్వార్‌)పై దేవి అహిల్య విశ్వవిద్యాలయం (ఇండోర్‌), యూనివర్సిటీ ఆఫ్‌ కోట (కోట)పై ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్‌), మణిపూర్‌ యూనివర్సిటీ (కాంచీపూర్‌)పై కువెంపు యూనివర్సిటీ (శివమొగ్గ), మహాత్మా జ్యోతిరావు పూలే రొహిల్‌ఖండ్‌ యూనివర్సిటీ (బరేలీ)పై విశ్వేశ్వరయ్య టెక్నాలజికల్‌ యూనివర్సిటీ (బెల్గావి), మౌలానా ఆజాద్‌ యూనివర్సిటీ (జోధ్‌పూర్‌)పై భూపాల్‌ నోబెల్స్‌ యూనివర్సిటీ (ఉదయ్‌పూర్‌), తెలంగాణ యూనివర్సిటీ (నిజామాబాద్‌)పై స్వర్ణజిత్‌ గుజరాత్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ (దేశర్‌), జేఎన్‌టీయూ అనంతపురంపై డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ మారఠ్వాడ యూనివర్సిటీ (ఔరంగాబాద్‌) విజయం సాధించాయి.

అట్టహాసంగా సాఫ్ట్‌బాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం 1
1/1

అట్టహాసంగా సాఫ్ట్‌బాల్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement