
ఉలవపాడు మామిడికి గుర్తింపునకు ప్రణాళికలు
● కేవీకేలో శాసీ్త్రయ సలహా సంఘ
సమావేశంలో శాస్త్రవేత్తలు
కందుకూరు రూరల్: ఉలవపాడు మామిడికి భౌగోళిక గుర్తింపునకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఐసీఏఆర్ నిర్కా డైరెక్టర్ శేషు మాధవ్, ఐసీఏఆర్ అటారీ డైరెక్టర్ షేక్ ఎన్.మీరా తెలిపారు. కందుకూరులోని కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో బుధవారం శాసీ్త్రయ సలహా సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతు సంఘాలుగా ఏర్పాటు చేసి సెకండరీ అగ్రికల్చర్‌ను ప్రమోట్ చేయాలన్నారు. మిరపలో ఎల్‌సీఏ–643 రకం మంచి ఫలితాన్నిచ్చిందని, దీనిని రైతులకు చేరవేయాలన్నారు. కేవీకే హెడ్ జి.ప్రసాద్‌బాబు, శాస్త్రవేత్తలు జ్యోతి, వెంకటేష్, మయాంక్, నిహారిక, శ్రీరంగ, వివేక్‌లు గత సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాల ఫలితాలు, వచ్చే ఏడాది చేపట్టబోయే కార్యక్రమాలను వివరించారు. నాబార్డ్ జిల్లా అధికారి బాబు, లీడ్ బ్యాక్ మేనేజర్ రమేష్, మత్స్యశాఖ అధికారిణి వర్షిణి, వెటర్నరీ డీడీ చంద్రశేఖర్, శ్రీధర్ తదితరులు పాల్గొని సలహాలు, సూచనలు చేశారు. నూతన మట్టి పరీక్షల క్షేంద్రాన్ని, విలువ ఆధారిత ఉత్పత్తుల్లో ఔత్సాహికుల తయారీ కేంద్రాన్ని అతిథులు ప్రారంభించారు.