
వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ
నెల్లూరు(దర్గామిట్ట): వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఎమ్మెల్సీ బల్లి కల్యాణ్ చక్రవర్తి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలో ఎమ్మెల్సీలతో జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ను కల్యాణ్ చక్రవర్తి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట పార్టీ యువత విభాగం కార్యదర్శి కొణిదల నాగేంద్ర ఉన్నారు.
పూరిల్లు దగ్ధం
ఇందుకూరుపేట: మండలంలోని కొమరిక గ్రామానికి చెందిన దాసరి సుభాషిణమ్మ పూరిల్లు గురువారం షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధమైంది. ఈ సమయంలో గ్యాస్ సిలిండర్ పేలింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి మంటలను ఆర్పివేశారు. వృద్ధురాలైన సుభాషిణమ్మ కట్టుబట్టలతో మిగి లారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
రైళ్లలో చోరీలపై
దర్యాప్తు ముమ్మరం
బిట్రగుంట: శ్రీవెంకటేశ్వరపాళెం రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున సిగ్నల్స్ ట్యాంపరింగ్ చేసి ధర్మవరం ఎక్స్‌ప్రెస్, తిరుపతి స్పెషల్ రైళ్లలో దొంగలు చోరీలకు పాల్పడిన ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఘటనా స్థలం నుంచి సాంకేతిక ఆధారాలు సేకరించడంతోపాటు ఈ తరహా నేరాల్లో ఆరితేరిన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ గ్యాంగ్‌ల కదలికలపై గురువారం ఆరా తీశారు. మహారాష్ట్రకు చెందిన సుమారు పదికి పైగా గ్యాంగ్‌లు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎనిమిది గ్యాంగ్‌లు సిగ్నల్స్ ట్యాంపర్ చేసి దోపిడీలు చేయడంలో సిద్ధహస్తులని తెలిసింది. వారి కదలికలకు సంబంధించిన వివరాలు పూర్తిస్థాయిలో సేకరిస్తున్నారు. మీర్జాపూర్, శిక్కా గ్యాంగ్‌లు ఎక్కువగా ఏపీలో ఈ తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో దర్యాప్తు వేగవంతం చేశారు. అదే విధంగా స్థానికంగా కూడా ఇలాంటి నేరాలకు పాల్పడే వారి గురించి తెలుసుకునే పనిలో ఉన్నారు. రైళ్లలో తిరుగుతూ ముందుగానే స్టేషన్ ఔటర్లకు దగ్గరగా ఉండే సిగ్నలింగ్ పాయింట్లను గుర్తిస్తున్న ముఠాలు సమయం చూసుకుని సిగ్నల్స్ ట్యాంపర్ చేయడం ద్వారా దోపిడీలకు పాల్పడుతున్నాయి. 2016 నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఈ తరహా నేరాలకు రైల్వేశాఖకు, రైల్వే పోలీసులకు తలనొప్పిగా మారాయి. రైల్వే పోలీసులు ఎప్పటికప్పుడు పటిష్ట చర్యలు చేపడుతున్నా సిగ్నల్ ట్యాంపరింగ్ చేసే ఘటనలు మాత్రం ఆగడం లేదు.

వైఎస్ జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ