సంగం: కావలి కాలువ ఆయకట్టు రైతులు సాగునీటిని పొదుపుగా వాడుకోవాలని కావలి కాలువ డీఈ వెంకటరమణయ్య సూచించారు. స్థానిక జలవనరుల శాఖ అతిథి గృహంలో కావలి కాలువ ఆయకట్టు రైతులతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. సాగునీటి పొదుపుపై అవగాహన కల్పించారు. సోమశిల నుంచి నీటి విడుదల తగ్గుతున్నందున కావలి కాలువ కింద మోటార్ల ద్వారా పండించుకునే ఏడు గ్రామాల రైతులు వారంలో నాలుగు రోజులు మాత్ర మే సాగునీటిని వాడుకోవాలని సూచించారు. సాగునీటి విషయంలో ఇరిగేషన్ అధికారులకు రైతులు సహకరించాలన్నారు. ఈ సమావేశంలో మండల వ్యవసాయాధికారి శ్రీహరి, వైఎస్సార్‌సీపీ మాజీ మండల కన్వీనర్ కంటాబత్తిన రఘునాథరెడ్డి, ఏఈ రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.