
మాట్లాడుతున్న డీసీఓ సుధాభారతి
నెల్లూరు(దర్గామిట్ట): రాజ్యసభ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ రీజినల్ కోఆర్డినేటర్ వేణుంబాక విజయసాయిరెడ్డి మంగళవారం నెల్లూరుకు రానున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకు హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరులోని వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుంటారు. పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
నేటి నుంచి
సహకార వారోత్సవాలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): అఖిల భారత సహకార వారోత్సవాలు మంగళవారం నుంచి 20వ తేదీ వరకు జరగనున్నాయి. నగరంలోని కలెక్టరేట్‌లో ఉన్న డీసీఓ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా సహకారశాఖ అధికారి సుధాభారతి మాట్లాడుతూ నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఉన్న జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ)లో ఉదయం 10.30 గంటలకు ఈ వారోత్సవాలను రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. 14న సహకార సంఘాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, 15న పరపతేతర సహకార సంఘాలు, ఆర్థిక చేరిక పునరుజ్జీవం, 16న సహకార సంస్థల డిజిటలైజేషన్, సాంకేతికతను స్వీకరించడం, 17న సహకార సంస్థల ద్వారా వ్యాపారాల సరళతరం, 18న పబ్లిక్, ప్రైవేట్‌లలో సహకార భాగస్వామ్యం, బలోపేతం, 19న మహిళలు, యువత, బలహీన వర్గాల కోసం సహకార సంఘాలు, 20న సహకార విద్య, శిక్షణ, పునర్నిర్మాణం అనే అంశాలపై వారోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వారోత్సవాలను విజయవంతం చేయాలని ఆమె కోరారు.
గ్రీకో రోమన్
చాంపియన్ నెల్లూరు
విజయవాడరూరల్: రాష్ట్ర పాఠశాలల క్రీడా సమాఖ్య నిర్వహించిన అంతర్ జిల్లాల అండర్–19 బాలికల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను ఆతిథ్య కృష్ణా జిల్లా జట్టు కై వసం చేసుకుంది. బాలుర చాంపియన్‌షిప్‌ను చిత్తూరు జట్టు, బాలుర గ్రీకో రోమన్ చాంపియన్‌షిప్‌ను నెల్లూరు జట్టు దక్కించుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ సహకారంతో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) కృష్ణాజిల్లా ఆధ్వర్యంలో విజయవాడ రూరల్ మండలంలోని నున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాగణంలో నిర్వహించిన అండర్–19 బాల బాలికల రెజ్లింగ్ చాంపియన్ షిప్ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. రాష్ట్రంలోని 13 ఉమ్మడి జిల్లాల నుంచి సుమారు 320 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అండర్–19 బాలికల ప్రీస్టైల్ విభాగంలో కృష్ణా జిల్లా జట్టు రెండు బంగారు, ఒక రజితం, ఐదు కాంస్య పతకాలను సాధించి 145 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి ఓవరాల్ చాంపియన్‌షిప్‌ను కై వసం చేసుకుంది. బాలుర విభాగంలో చిత్తూరు జిల్లా జట్టు మూడు బంగారు, రెండు కాంస్య పతకాలతో 105 పాయింట్లు సాధించి ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. బాలుర గ్రీకో రోమన్‌లో నెల్లూరు జిల్లా క్రీడాకారులు రెండు బంగారు, రెండు రజితం, మూడు కాంస్య పతకాలతో 135 పాయింట్లను సాధించి చాంపియన్‌షిప్‌ను దక్కించుకున్నారు.
హోరాహోరీగా ఇంటర్
జోనల్ క్రికెట్ పోటీలు
● దేవ్‌ప్రమోద్ బ్యాటింగ్ భళా
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): బుజబుజనెల్లూరులోని సీఐఏ క్రీడామైదానంలో అండర్–16 ఇంటర్ జోనల్ క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగుతున్నాయి. సోమ వారం జరిగిన మ్యాచ్‌లలో సెంట్రల్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 203 పరుగులు సాధించగా, జట్టులోని జి.దేవప్రమోద్ 103, ఎన్.రాజేష్ 89 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన సౌత్‌జోన్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌలైంది. ఈ జట్టులోని మురారిహృదయ్ 71 పరుగులు చేశారు. మధ్యాహ్నం సెంట్రల్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 223 పరుగులు సాధించింది. సౌత్‌జోన్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు కోల్పోయి 90 పరుగులు సాధించింది. మ్యాచ్ డ్రా కావడంతో తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన సౌత్‌జోన్ జట్టును విజేతగా ప్రకటించారు. పోటీలను జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు సీవీఎన్‌మూర్తి, డి.నిఖిలేశ్వరరెడ్డి, సంయుక్త కార్యదర్శి కె.మునిగిరీష్, ఏసీఏ సెలెక్టర్ మలిరెడ్డి కోటారెడ్డి, జిల్లా క్రికెట్ అసోసియేషన్ అడ్వైజర్, మాజీ కార్యదర్శి డి.శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు.

జి.దేవ్‌ప్రమోద్
