కోహ్లి.. నువ్వు మరిన్ని సిక్సర్లు కొట్టాలి : యూవీ

Yuvraj Singh Made Hillarious Tweet On Virat Kohli Birthday - Sakshi

ముంబై : టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ గురువారం 32 వ పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు మాజీ క్రికెటర్లు కోహ్లికి శుభాకాంక్షలతో ముంచెత్తారు. తాజాగా టీమిండియా మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్ సింగ్ కోహ్లీకి ట్విటర్‌ వేదికగా వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపాడు. 'నా పుట్టినరోజు శుభాకాంక్షలు అందుకో కోహ్లి .. నువ్వు ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉంటూ ఇంకా ఎక్కువ సిక్సర్లు కొట్టాలి. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగే ప్లేఆఫ్‌లో మీ జట్టు గెలవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా. ఆల్‌ ది బెస్ట్‌ ' అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ఈ సందర్భంగా కోహ్లితో కలిసి దిగిన ఫోటోను యూవీ షేర్‌ చేశాడు. (చదవండి : వైరలవుతున్న కోహ్లి బర్త్‌డే వేడుకలు)

ఐపీఎల్‌ 13వ సీజన్‌ సందర్భంగా యూఏఈలో ఉన్న కోహ్లి ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగే ప్లేఆఫ్‌ మ్యాచ్‌కు సన్నద్దమవుతున్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తేనే కోహ్లి సేన ముందు​కెళుతుంది... లేదంటే ఇంటిదారి పట్టాల్సిందే.  ఐపీఎల్‌లో ఇప్పటివరకు 12  సీజన్లు ముగిసినా ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవని ఆర్‌సీబీ.. ఈసారి ఎలాగైనా కప్‌ కొట్టాలనే కసితో ఉంది. ఈ క్రమంలోనే ఆరంభంలో రెండు మూడు మ్యాచ్‌లు తడబడినా ఆ తర్వాత తేరుకొని వరుస విజయాలు సాధించింది. (చదవండి : రైట్‌ ఆర్మ్‌ క్విక్‌ బౌలరా.. కోహ్లి ఏంటిది!)

అయితే చివర్లో మళ్లీ హ్యాట్రిక్‌ ఓటములు పలకరించడంతో ఆర్‌సీబీ ఒక దశలో ప్లేఆఫ్‌ చేరుతుందా అన్న అనుమానం కలిగింది. అయితే అన్ని అడ్డంకులు అధిగమించి చివరికి ఎలాగోలా ప్లేఆఫ్‌ చేరిన కోహ్లి సేన ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఏం చేయనుందనేది శుక్రవారంతో తేలిపోనుంది. కెప్టెన్‌గా మంచి ఫామ్‌ కనబరుస్తున్న కోహ్లి ఇప్పటివరకు ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లాడి 460 పరుగులు సాధించాడు. ఇందులో మూడు ఆఫ్‌ సెంచరీలు ఉన్నాయి. సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో 90 పరుగుల నాకౌట్‌ ఇన్నింగ్స్‌ ఈ సీజన్‌లో కోహ్లి అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పొచ్చు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top