డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టోరీ్నకి యాష్లే బార్టీ దూరం | World number one Ashleigh Barty pulls out of WTA Finals, ends season | Sakshi
Sakshi News home page

డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ టోరీ్నకి యాష్లే బార్టీ దూరం

Published Sun, Oct 24 2021 5:31 AM | Last Updated on Sun, Oct 24 2021 5:31 AM

World number one Ashleigh Barty pulls out of WTA Finals, ends season - Sakshi

మహిళల టెన్నిస్‌ సంఘం (డబ్ల్యూటీఏ) సీజన్‌ ముగింపు టోర్నమెంట్‌ డబ్ల్యూటీఏ ఫైనల్స్‌ నుంచి ప్రపంచ నంబర్‌వన్, డిఫెండింగ్‌ చాంపియన్‌ యాష్లే బార్టీ వైదొలిగింది. వచ్చే నెల 10 నుంచి 17 వరకు మెక్సికోలని గ్వాడాలహారా నగరంలో ఈ మెగా టోర్నీ జరగనుంది. ప్రపంచ సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లోని టాప్‌–8 క్రీడాకారిణులు ఈ టోర్నీలో పాల్గొనేందుకు అర్హులు. ‘వచ్చే ఏడాదిలో కొత్త ఉత్సాహంతో బరిలో దిగేందుకు సీజన్‌ ముగింపు టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నాను’ అని 25 ఏళ్ల బార్టీ తెలిపింది. ఈ సీజన్‌లో బార్టీ వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీతో కలిపి మొత్తం ఐదు టైటిల్స్‌ సాధించి ఈ ఏడాదిని నంబర్‌వన్‌ ర్యాంక్‌తో ముగించనుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement