
Beijing Winter Olympics 2022: బీజింగ్ వేదికగా జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌పై కరోనా మహమ్మారి పంజా విసురుతుంది. తాజాగా 45 కొత్త కేసులు నమోదైనట్లు ఒలింపిక్ నిర్వాహక కమిటీ శనివారం ప్రకటించింది. ఇందులో 26 మంది కొత్తగా విదేశాల నుంచి వచ్చిన వారు కాగా, మిగతా వారు ఇప్పటికే అక్కడికి చేరుకున్న వారు. ఒలింపిక్స్ కోసం అథ్లెట్లు, సహాయ సిబ్బంది కలుపుకుని దాదాపు 12 వేల మంది బీజింగ్‌లో అడుగుపెట్టగా.. వీరిలో 353 మంది మహమ్మారి బారిన పడినట్లు నిర్వాహకులు తెలిపారు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, ప్రస్తుతం పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని వారు స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే, భారత్ నుంచి ఒకే ఒక అథ్లెట్ బీజింగ్ ఒలింపిక్స్ బరిలో నిలిచాడు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఆరిఫ్ ఖాన్.. స్కీయింగ్ పోటీల్లో పాల్గొన్నాడు.
చదవండి: 'ఐదేళ్లలో ఒక్కసారి కూడా చోటు కోల్పోలేదు.. ఆరోజు మాత్రం'