 
															PC: ipl.com
లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటర్ ఆయుష్ బదోని ఐపీఎల్ తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఐపీఎల్-2022లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో బదోని అర్దసెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో 41 బంతుల్లో 54 పరుగులు చేసిన బదోని.. లక్నో మెరుగైన స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అతడి ఇన్నింగ్స్‌లో నాలుగు ఫోర్లు, మూడు సిక్స్‌లు ఉన్నాయి.
29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన లక్నోను దీపక్ హుడాతో కలిసి బదోని అదుకున్నాడు. ప్రపంచ టీ20 నెం1 బౌలర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అద్భుతమైన సిక్స్ కొట్టి ఆశ్చర్యపరిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు సాధించింది. ఐపీఎల్-2022 మెగా వేలంలో భాగంగా బదోనిని రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది. ఢిల్లీకు చెందిన ఈ యువ ఆటగాడు 2018 అండర్-19 ఆసియా కప్‌లో భారత్ తరుపున అదరగొట్టాడు. అదే విధంగా శ్రీలంకతో జరిగిన యూత్ అండర్-19 టెస్టులో శ్రీలంకపై 202 బంతుల్లో 185 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.
చదవండి: IPL 2022: శుభ్‌మన్ గిల్ అద్భుతమైన క్యాచ్.. సూపర్ మ్యాన్‌లా డైవ్ చేస్తూ ..
Hooda on fire at the Wankhede 💥💥
— IndianPremierLeague (@IPL) March 28, 2022
Live - https://t.co/u8Y0KpnOQi #GTvLSG #TATAIPL | @HoodaOnFire https://t.co/RitZyuxGI6 pic.twitter.com/AHzA48RkXJ

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
