శుభ్‌మన్‌ గిల్‌ అద్భుతమైన క్యాచ్‌.. సూపర్ మ్యాన్‌లా డైవ్‌ చేస్తూ .. | Shubman Gill fine running catch to dismiss Evin Lewis | Sakshi
Sakshi News home page

IPL 2022: శుభ్‌మన్‌ గిల్‌ అద్భుతమైన క్యాచ్‌.. సూపర్ మ్యాన్‌లా డైవ్‌ చేస్తూ ..

Mar 28 2022 8:46 PM | Updated on Mar 28 2022 9:17 PM

Shubman Gill fine running catch to dismiss Evin Lewis - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2022లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో వర్సెస్‌ గుజరాత్‌ టైటాన్స్‌ మ్యాచ్‌లో శుభ్‌మన్‌ గిల్‌ సంచలన క్యాచ్‌తో మెరిశాడు. లక్నో ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌ వేసిన వరుణ్ ఆరోన్ బౌలింగ్‌లో.. ఎవిన్ లూయిస్‌ పుల్‌  షాట్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే అది మిస్‌ టైమ్‌ అయ్యి బంతి గాల్లోకి లేచింది. ఈ క్రమంలో మిడ్‌ వికెట్‌ వద్ద ఫీల్డింగ్‌ చేస్తున్న గుజరాత్‌ టైటాన్స్‌ ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ పరిగెత్తుతూ అద్భుతమైన రన్నింగ్‌ క్యాచ్‌ను అందుకున్నాడు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ పీకల్లోతు కష్టాల్లో పడింది. 11 ఓవర్లు ముగిసేసరికి లక్నో నాలుగు వికెట్లు కోల్పోయి 58 పరుగులు చేసింది. అదే విధంగా కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌ తీవ్ర నిరాశపరిచాడు. మహ్మద్ షమీ వేసిన తొలి ఓవర్‌ తొలి బంతికే రాహుల్‌ డకౌట్‌గా వెనుదిరిగాడు.

చదవండి: IPL 2022: కొత్త టీమ్‌, కొత్త కెప్టెన్‌.. తొలి మ్యాచ్‌.. తొలి బంతికే లక్నోకు షాక్‌!

Advertisement
 
Advertisement
Advertisement