IPL 2022: First Ball of the Game KL Rahul Departs for Duck - Sakshi
Sakshi News home page

IPL 2022: కొత్త టీమ్‌, కొత్త కెప్టెన్‌.. అయ్యో రాహుల్‌! గోల్డెన్‌ డక్‌..

Mar 28 2022 8:06 PM | Updated on Mar 28 2022 9:29 PM

First ball of the game KL Rahul departs for duck - Sakshi

లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కెఎల్‌ రాహుల్‌ తొలి మ్యాచ్‌లోనే తీవ్రంగా నిరాశపరిచాడు. ఐపీఎల్‌-2022లో భాగంగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో తొలి బంతికే రాహుల్‌ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. మహ్మద్‌ షమీ వేసిన తొలి ఓవర్‌  తొలి బంతికే వికెట్‌ కీపర్‌ వేడ్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. షమీ వేసిన తొలి బంతిని రాహుల్‌ డిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌ను తాకుతూ వికెట్‌ కీపర్‌ చేతికి వెళ్లినట్లు అనిపించింది.

ఈ క్రమంలో వికెట్‌ కీపర్‌తో పాటు, గుజరాత్‌ ఫీల్డర్‌లు భారీగా అప్పీల్‌ చేశారు. అయితే అంపైర్‌ నాటౌట్‌ అని తల ఊపాడు. వెంటనే  గుజరాత్‌ టైటాన్స్‌ కెప్టెన్‌ హార్ధిక్‌ పాండ్యా రివ్యూకు వెళ్లాడు. రిప్లేలో సృష్టంగా బంతి బ్యాట్‌ను తాకినట్లు కనిపించింది. దీంతో అంపైర్‌ తన నిర్ణయాన్ని వెనుక్కి తీసుకుని ఔట్‌గా ప్రకటించాడు. ఇక 5 ఓవర్లు ముగిసే సరికి లక్నో సూపర్‌ జెయింట్స్‌ 4 వికెట్లు కోల్పోయి 29 పరుగులు చేసింది. కాగా ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌,గుజరాత్‌ టైటాన్స్‌ కొత్త జట్లుగా అవతరించిన సంగతి తెలిసిందే.

చదవండిGlenn Maxwell: తమిళ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న ఆర్సీబీ స్టార్‌ ఆల్‌రౌండర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement