కలిసిపోయిన విరాట్‌ కోహ్లి-నవీన్‌ ఉల్‌ హక్‌! వీడియో వైరల్‌ | IND Vs AFG: Virat Kohli And Naveen Ul Haq Share Warm In World Cup Clash After Viral IPL Spat, Video And Pics Viral - Sakshi
Sakshi News home page

Virat Kohli-Naveen Ul Haq Hug Video: కలిసిపోయిన విరాట్‌ కోహ్లి-నవీన్‌ ఉల్‌ హక్‌! వీడియో వైరల్‌

Published Wed, Oct 11 2023 9:45 PM

Virat Kohli, Naveen Ul Haq Hug It Out In World Cup Clash - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో టీమిండియా తమ జోరును కొనసాగిస్తోంది. ఈ టోర్నీలో భాగంగా ఢిల్లీ వేదికగా ఆఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(54 బంతుల్లో 131) విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 274 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 35 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

కలిసిపోయిన విరాట్‌ కోహ్లి-నవీన్‌
ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి, ఆఫ్గానిస్తాన్‌ పేసర్‌ నవీన్-ఉల్-హక్ కలిసిపోయారు. ఈ మ్యాచ్‌ సందర్భంగా ఒకరినొకరు కౌగిలించుకుని తమ మధ్య ఉన్న వైరానికి ఫుల్‌స్టాప్‌ పెట్టారు. కాగా ఐపీఎల్‌-2023లో ఆర్సీబీ వర్సెస్‌ లక్నో మ్యాచ్‌ సందర్భంగా నవీన్ ఉల్ హక్‌కు కోహ్లికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో విరాట్‌ అభిమానులు నవీన్‌ ఎక్కడ కన్పించిన కోహ్లి కోహ్లి అంటూ అరుస్తూ అతడిని టార్గెట్‌ చేస్తూ వస్తున్నాడు. ఈ వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో కూడా 'కోహ్లీ కోహ్లి' నినాదాలతో స్టేడియం దద్దరిల్లిపోయింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి, నవీన్‌కు మధ్య మంచి పోటీ ఉంటుందని అంతా భావించారు.

కోహ్లి కూడా నవీన్‌ను టార్గెట్‌ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ అదేమి జరగలేదు. అందరి ఊహలను తలకిందలు చేస్తూ ఇద్దరూ క్రీడా స్పూర్తిని ప్రదర్శించారు. ఒకరికొకరు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ అలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లే మా కింగ్‌ కోహ్లితో అట్లుంటది  కామెంట్లు చేస్తున్నారు.
చదవండిWC 2023 IND Vs AFG: రోహిత్‌ శర్మ ఊచకోత.. ఆఫ్గాన్‌ను చిత్తు చేసిన భారత్‌

Advertisement
 
Advertisement