Viral Video: Ashwin Daughter Crying After He Gets Out During GT VS RR Match - Sakshi
Sakshi News home page

Viral Video: తండ్రి ఔట్‌ కావడంతో బోరు ఏడ్చేసిన కూతురు

Apr 18 2023 6:32 PM | Updated on Apr 18 2023 6:57 PM

Viral Video: Ashwin Daughter Crying After He Gets Out During GT VS RR Match - Sakshi

ఐపీఎల్‌-2023లో భాగంగా ఏప్రిల్‌ 16న గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ అయిపోయిన రెండు రోజుల తర్వాత ఓ ఆసక్తికర వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇందులో ఆశ్విన్‌ చిన్నకూతురు బోరున ఏడుస్తూ కనిపించింది. ఆ చిన్నారి ఏడుపు కారణం ఏంటంటే.. తన తండ్రి అశ్విన్‌ ఔట్‌ కావడం. 

అంతకుముందు అశ్విన్‌ బౌండరీ, సిక్సర్‌ బాదినప్పుడు ఫ్లైయింగ్‌ కిస్‌లు ఇస్తూ కేరింతలు కొట్టిన ఆ చిన్నారి.. తండ్రి ఔట్‌ కాగా బాధ తట్టుకోలేక బోరున విలపించింది. ఈ మొత్తం తంతును తొలుత అశ్విన్‌ భార్య ప్రీతి నారాయణన్‌ తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్‌ చేయగా, ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. 

కాగా, ఆ మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌.. కీలక తరుణంలో (10 బంతుల్లో 17 పరుగులు) క్రీజ్‌లోకి వచ్చి షమీ బౌలింగ్‌లో వరుసగా బౌండరీ, సిక్సర్‌ బాది ఆ తర్వాతి బంతికే ఔటయ్యాడు. అనంతరం హెట్‌మైర్‌ సిక్సర్‌ బాది మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన గుజరాత్‌.. గిల్‌ (45), మిల్లర్‌ (46) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేయగా.. రాజస్థాన్‌ 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్థాన్‌ గెలుపులో సంజూ శాంసన్‌ (60), షిమ్రోన్‌ హెట్‌మైర్‌ (56 నాటౌట్‌)  కీలకపాత్ర పోషించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement