Twitterati Roasts Hypocrite Jasprit Bumrah For Using Crackers During His Wedding Celebrations - Sakshi
Sakshi News home page

బుమ్రా పెళ్లి వేడుకల్లో బాణసంచా కాల్చడంపై నెటిజన్ల ఆగ్రహం

Mar 20 2021 4:46 PM | Updated on Mar 20 2021 5:24 PM

Twitter Users Fired On Jasprit Bumrah Wedding Pictures - Sakshi

ముంబై: కొద్దిరోజుల కిందటే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన టీమిండియా పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు ఊహించని తలనొప్పులు వచ్చి పడ్డాయి. తన పెళ్లి వేడుకల్లో తీసుకున్న ఫోటోల్లో బాణసంచా కాల్చడం కనిపించడంతో నెటిజన్లు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2017లో దీపావళి రోజున టపాసులు కాల్చొద్దని ఆయన, తన అభిమానులను కోరుతూ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీటే ఆయన తలనొప్పికి కారణంగా మారింది.

తన వివాహ వేడుకకు సంబంధించిన రెండు ఫోటోలను శుక్రవారం ఆయన ట్విటర్‌లో షేర్‌ చేయడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. 'టపాసులు కాల్చొద్దని ఇతరులకు నీతులు చెప్పడమేనా.. మీరు స్వయంగా ఏమైనా పాటించేదుందా' అంటూ కొందరు, 'ఆచరణ సాధ్యంకాని ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని' మరికొందరు కామెంట్లు చేశారు. గతంలో ఆయన చేసిన ట్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ నెటిజన్లు రకరకాల పంచ్‌లు వేస్తున్నారు. కాగా, బుమ్రా ఈనెల 15న క్రీడా ఛానల్‌ వ్యాఖ్యాత సంజన గణేశన్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement