Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Southwest Monsoon Winds Hit Kerala
నైరుతి వచ్చేసింది.. వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి..

సాక్షి, విశాఖపట్నం: నైరుతి రుతు పవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. గురువారం ఉదయం కేరళను తాకాయి. కేరళ సహా ఈశాన్య రాష్ట్రాల్లోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించాయి. వారంలో తెలుగు రాష్టాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. గతేడాది కంటే ముందుగానే నైరుతి పవనాలు రాగా, ఇప్పటికే కేరళ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు.. కేరళ రాష్ట్రాన్ని ఐఎండీ అలెర్ట్ చేసింది.నాలుగైదు రోజుల్లో రుతుపవనాలు రాయల­సీమ­లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతా­వరణ శాఖాధికారులు తెలిపారు. ఇప్పటికే నైరు­తి రుతుపవనాలు దక్షిణ అరేబియా సము­ద్రం­లోని ఎక్కువ ప్రాంతాలు, మాల్దీవులు, కొమోరిన్‌ ప్రాంతాల్లో విస్తరించాయి. లక్షద్వీప్‌లోని కొన్ని ప్రాంతాలు, కేరళ, మరికొన్ని భాగాలు నైరుతి, మధ్య బంగా­ళాఖాతం, ఈశాన్య బంగాళా­ఖాతం, ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాయి.కాగా, వారం ముందుగానే రుతుపవనాలు పురోగమిస్తుండడంతో ఈ సీజన్‌లో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రుతుపవనాల పురోగమనం, రెమల్‌ తుఫాన్‌ కారణంగా ప్రస్తుతం రోహిణీ కార్తె ఉన్నా దాని ప్రభావం పెద్దగా రాష్ట్రంపై పడలేదు. స్వల్పంగానే ఉష్ణోగ్రతలు పెరిగాయి. బుధవారం పలుచోట్ల 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లా పోయిమలలో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా చిరుమామిళ్లలో 42.5, గరికపాడులో 42 డిగ్రీలు, విజయవాడలో 39.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే రెండు రోజులు కూడా వాతావరణం ఈ మాదిరిగానే ఉండవచ్చని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

AP ECET Results 2024 Released
ఏపీ ఈసెట్‌ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో రిజల్ట్‌

ఏపీ ఈసెట్‌ ఫలితాలు కోసం రిజల్ట్‌ కోసం క్లిక్‌ చేయండి

West Indies storm to fourth position in T20I Team Rankings
టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన విండీస్‌.. టాప్‌లోనే భార‌త్‌

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో వెస్టిండీస్ స‌త్తా చాటింది. అంత‌ర్జాతీయ‌ తాజాగా ప్ర‌క‌టించిన ర్యాంకింగ్స్‌లో విండీస్ జ‌ట్టు రెండు స్ధానాలు ఎగ‌బాకి నాలుగో స్ధానానికి చేరుకుంది. స్వ‌దేశంలో దక్షిణాఫ్రికాతో జ‌రిగిన సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన కరేబియ‌న్లు.. న్యూజిలాండ్‌, ద‌క్షిణాఫ్రికాను వెన‌క్కి నెట్టి నాలుగో ర్యాంక్‌ను సొంతం చేసుకుంది.టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2024కు ముందు వెస్టిండీస్ జ‌ట్టు అద్బుత‌మైన ఫామ్‌లో ఉంది. రెగ్యూలర్ కెప్టెన్ పావెల్‌, ఆండ్రీ రస్సెల్‌, హెట్‌మైర్ వంటి ఆట‌గాళ్లు లేకుండానే ప్రోటీస్ జ‌ట్టును వెస్టిండీస్ చిత్తు చేసింది. బౌలింగ్‌, బ్యాటింగ్ అన్ని విభాగాల్లో కరేబియ‌న్లు స‌త్తాచాటారు.త‌మ సొంత గ‌డ్డ‌పై జ‌రగ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లోనూ ఇదే జోరును కొన‌సాగించాల‌ని విండీస్ జ‌ట్టు భావిస్తోంది. ఇక ఇది ఇలా ఉండ‌గా.. టీ20 ర్యాకింగ్స్‌లో అగ్ర‌స్ధానంలో భార‌త్(264 రేటింగ్‌) కొన‌సాగుతోంది. టీమిండియా త‌ర్వాతి స్ధానాల్లో వ‌రుస‌గా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ నిలిచాయి.

Congress Mark Rajmudra With Three Colours In Telangana
మూడు రంగులతో కాంగ్రెస్ మార్క్ రాజముద్ర

సాక్షి, హైదరాబాద్‌: అధికారంలో ఉండటంతో కాంగ్రెస్‌ తమ మార్క్‌ రాజ ముద్ర వేసుకునేందుకు సిద్ధమవుతోంది. అధికారిక గేయం ఎంపిక.. అధికారిక చిహ్నానికి మార్పులపై కసరత్తు చేస్తోంది. పలు రకాలు లోగోలు డిజైన్‌ చేయగా, రాజముద్రలో మూడు సింహాల జాతీయ చిహ్నం, వ్యవసాయం, తెలంగాణ వీరుల స్తూపానికి చోటు లభించినట్లు సమాచారం. ఆవిర్భావ దినోత్సవం రోజున లోగా ఆవిష్కరించనున్నారు. లోగో ఖారారుపై సీనియర్‌ నేతలతో సీఎం రేవంత్‌ చర్చిస్తున్నారు.. పార్టీ నేతలతో భేటీ తర్వాత ఇవాళ రాష్ట్ర చిహ్నాన్ని ఖారారు చేసే అవకాశం ఉంది.కాగా, దశాబ్ది ఉత్సవాల క్రమంలోనే.. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పులు చేయాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాచరిక ఆనవాళ్లు లేకుండా చార్మినార్, కాకతీయ కళాతోరణం చిహ్నాలను అధికారిక లోగో నుంచి తొలగించే ప్రతిపాదనలపై బీఆర్‌ఎస్‌ తీవ్రంగా విరుచుకుపడుతోంది.తెలంగాణలో మార్పు కావాలని ఎన్నికల ముందు కాంగ్రెస్‌ చెప్పిందని.. అధికారిక చిహ్నాలను మార్చడమే మీరు తెచ్చే మార్పా అని నిలదీస్తోంది. అయితే ఈ అంశాలపై బీజేపీ ఏమాత్రం స్పందించకపోవడం గమనార్హం. దశాబ్ది వేడుకలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టలేదు. కానీ దశాబ్ది వేడుకలకు సోనియాగాం«దీని ఏ హోదా ఉందని పిలుస్తారంటూ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

AP Election Counting On 4th June
ఇంకా రాదేం.. నాలుగో తేది!

సాక్షి, రాజమహేంద్రవరం: సార్వత్రిక సమరంలో చివరి ఘట్టం ఆవిష్కృతం కానుంది. మరో ఐదు రోజుల్లో ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. దేశవ్యాప్తంగా ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతుండటంతో పోలింగ్, కౌంటింగ్‌ ప్రక్రియల్లో జాప్యం చోటు చేసుకుంది. మన రాష్ట్రంలో ఈ నెల 13న పోలింగ్‌ ముగిసింది. వచ్చే నెల 4వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. కౌంటింగ్‌ సమయం సమీపిస్తుండడంతో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఇటు ప్రజల దృష్టంతా ఫలితాలపైనే ఉంది. నాలుగో తేదీ ఎంత వేగంగా వస్తుందా.. ఎప్పుడెప్పుడు ఫలితాలు తెలిసిపోతాయా.. అన్న ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. గెలుపోటములపై వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తుండగా.. టీడీపీ అభ్యర్థుల్లో మాత్రం అంతర్మథనం నెలకొంది. గెలుస్తామా? చతికిల పడతామా? అన్న ఆందోళన వెంటాడుతోంది. కౌంటింగ్‌కు కసరత్తు ఓట్ల లెక్కింపునకు అధికారులు ముమ్మర కసరత్తు నిర్వహిస్తున్నారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు, అధికారుల నియామకం, భద్రతా చర్యలపై జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత, ఎస్పీ పి.జగదీష్‌ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ సిబ్బందికి దిశా నిర్దేశం చేస్తున్నారు. నన్నయ విశ్వవిద్యాలయం మొత్తం పోలీసు పహరాలో ఉంది. కౌంటింగ్‌కు అవసరమైన టేబుళ్లు సైతం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటలకు తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల కౌంటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఈ మేరకు ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. విహార యాత్రలకు ముగింపు సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలువురు ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు విదేశీ, స్వదేశీ పర్యటనలకు వెళ్లారు. ఇన్నాళ్లూ ఎన్నికల ప్రచారాల్లో బిజీగా గడిపిన ద్వితీయ శ్రేణి నేతలు చిల్‌ అయ్యేందుకు గోవా చెక్కేశారు. మరికొందరు విహార యాత్రలు, ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఎక్కువ శాతం వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులు స్వగ్రామాల్లోనే కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు. ఇన్నాళ్లూ ఇంటికి దూరమైన లోటును పూడ్చుకుంటున్నారు. సొంత పనులు చూసుకుంటున్నారు. ప్రస్తుతం ఓట్ల లెక్కింపు ప్రక్రియ సమీపిస్తుండటంతో దేశ, విదేశాలకు వెళ్లినవారు ఇప్పుడు సొంత నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు. ఎన్నికల్లో గెలుపోటములపై సన్నిహితులతో ఆరా తీస్తున్నారు. పోలింగ్‌ సరళిని బట్టి ఎన్ని వేల ఓట్లతో గెలుస్తామన్న విషయమై అంచనాలు వేసుకుంటున్నారు. ఫలితాలు వెలువడే వరకు ఆగలేక తమ విజయావకాశాలపై వివిధ మార్గాల ద్వారా ప్రాథమిక అంచనాకు వస్తున్నారు. జ్యోతిషం, న్యూమరాలజీకి డిమాండ్‌ ఎన్నికల్లో గెలుపోటములపై తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అభ్యర్థులు వివిధ మార్గాలను వెతుకుతున్నారు. కొందరు జ్యోతిషులను ఆశ్రయిస్తున్నారు. తమ జాతకం ప్రకారం విజయావకాశాలపై ఆరా తీస్తున్నారు. ఏమైనా దోషాలు ఉంటే వాటిని తొలగించుకునే ప్రక్రియలు నిర్వహిస్తున్నారు. న్యూమరాలజీ ప్రకారం తాను గెలిచే అవకాశం ఉందా? అంకెలు అనువుగా ఉన్నాయా? లేదా? అన్న విషయమై స్పష్టత తీసుకుంటున్నారు. దీంతో జ్యోతిషులకు బాగా గిట్టుబాటు అవుతోంది.కార్యకర్తలకు దిశానిర్దేశం సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఎడతెగని ఉత్కంఠ నెలకొంది. పోలింగ్‌ అనంతరం విహార, ఆధ్యాతి్మక యాత్రలకు వెళ్లిన నేతలంతా సొంత నియోజకవర్గాలకు చేరుకుంటున్నారు. కౌంటింగ్‌ రోజు అనుసరించాల్సిన వ్యూహాలపై సన్నిహితులు, పార్టీ శ్రేణులతో చర్చించుకుంటున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో కీలకమైన ఏజెంట్లు, ఇతర ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. కౌంటింగ్‌ సరళి పరిశీలించడం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కార్యకర్తలకు అభ్యర్థులు దిశానిర్దేశం చేస్తున్నారు.సర్వేలతో సతమతం అభ్యర్థుల విజయంపై రోజుకో సర్వే మార్కెట్‌లో దర్శనమిస్తోంది. ఒక సర్వేలో ఒక అభ్యర్థి గెలుస్తారని స్పష్టం చేస్తే మరో సర్వేలో ఓటమి చెందుతున్నట్లు వెల్లడిస్తున్నారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి అభ్యర్థుల వంతవుతోంది. మరోవైపు అభ్యర్థుల పర్సనల్‌గా సర్వే సంస్థలను ఆశ్రయించి మరీ సర్వే చేయించుకుంటున్నారు. సర్వే చేయించుకునే అభ్యరి్థకి మీదే విజయమంటూ నమ్మబలికి రూ.లక్షలు వసూలు చేస్తున్నారు. వేల మెజార్టీతో గట్టెక్కుతారని వెల్లడిస్తుండటంతో అభ్యర్థులు ఇక తమ విజయం ఖాయమన్న ధీమాలో ఉన్నారు. బూత్‌ స్థాయి నుంచి మండల స్థాయి వరకు పోలైన ఓట్ల లెక్కలతో ఏ పారీ్టకి ఎన్ని ఓట్లు వస్తాయో.. స్వతంత్రుల ప్రభావం ఎవరిపై ఉంటుందో.. నోటా ఎవరి ఎవరి పాలిట శాపంగా మారనుందో వంటి అంశాలు ఆయా పారీ్టల నేతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. జిల్లాలో ప్రధాన పారీ్టలు ఇప్పటికే అంతర్గత సర్వేలు నిర్వహించి విజయంపై ఓ అంచనాకు వచ్చాయి.

Delhi Really Record India Highest Ever Temperature, IMD To Check Mungeshpur Readings
52.9 డిగ్రీలు.. నిజమేనా!?

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాదిలో ఎండల తీవ్రత నానాటికీ పెరుగుతోంది. బుధవారం రాజస్తాన్‌లో పలుచోట్ల ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటేసింది. పాకిస్తాన్‌ మీదుగా అక్కడి నుంచి వీస్తున్న తీవ్రమైన వేడి గాలులతో దేశ రాజధాని అల్లాడుతోంది. దాంతో వరుసగా రెండో రోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ క్రమంలో ఢిల్లీ సమీపంలోని ముంగేశ్‌పూర్‌లో దేశ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదైందంటూ వచి్చన వార్తలు కలకలం రేపాయి. మధ్యాహ్నం 2.30 సమయంలో అక్కడ 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు భారత వాతావరణ శాఖ ప్రాంతీయ డైరెక్టర్‌ కుల్‌దీప్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు. మన దేశంలో రాజస్తాన్‌ సహా ఏ రాష్ట్రంలోనూ ఇప్పటిదాకా ఇంతటి ఉష్ణోగ్రతలు నమోదవలేదు. అయితే 52.9 డిగ్రీలన్నది అధికారికంగా నిర్ధారణ కాలేదని కేంద్ర మంత్రి కిరణ్‌ రిజజు స్పష్టం చేశారు. ‘‘ఢిల్లీలో అంత ఉష్ణోగ్రత నమోదైందంటే నమ్మశక్యంగా లేదు. వాస్తవమేమిటో తెలుసుకోవాలని ఐఎండీ అధికారులకు సూచించాం. దీనిపై త్వరలో స్పష్టత వస్తుంది’’ అంటూ ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. దాంతో నిజానిజాలను పరిశీలిస్తున్నట్టు ఐఎండీ డైరెక్టర్‌ జనరల్‌ ఎం.మహాపాత్ర తెలిపారు. ‘‘డేటాలో తప్పులు దొర్లి ఉండొచ్చు. అంతటి ఉష్ణోగ్రత నిజమే అయితే స్థానిక పరిస్థితులేవైనా కారణమై ఉండొచ్చు. ముంగేశ్‌పూర్‌ వాతావరణ కేంద్ర సెన్సర్లను స్పెషలిస్టుల బృందం నిశితంగా అధ్యయనం చేస్తోంది’’ అని వివరించారు. బుధవారం రాజస్తాన్‌లోని ఫలోదీలో 51 డిగ్రీలు, పరిసర ప్రాంతాల్లో 50.8 డిగ్రీలు, హరియాణాలోని సిర్సాలో 50.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలోని నజఫ్‌గఢ్‌లో 49.1 డిగ్రీలు, పుసాలో 49, నరేలాలో 48.4 డిగ్రీలు నమోదైంది. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌లో ప్రాంతంలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అక్కడ గత 79 ఏళ్లలో ఇదే అత్యధికం. హరియాణా, పంజాబ్, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ కూడా ఎండ దెబ్బకు అల్లాడుతున్నాయి. హీట్‌ వేవ్‌ నేపథ్యంలో ఢిల్లీతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు రెడ్‌ అలెర్ట్‌ జారీ అయింది. ఎండలకు తోడు తీవ్రస్థాయిలో వడగాలులు వీస్తున్నాయి. దాంతో జనం బయటకు రావాలంటే వణికిపోతున్నారు. నిత్యం లక్షలాది వాహనాలతో రద్దీగా ఉండే ఢిల్లీ రోడ్లు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం దాకా నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. రికార్డు విద్యుత్‌ డిమాండ్‌ ఎండల ధాటికి ఢిల్లీలో విద్యుత్‌ డిమాండ్‌ చుక్కలనంటుతోంది. బుధవారం మధ్యాహ్నం 3.36 గంటలకు 8,302 మెగావాట్ల పవర్‌ డిమాండ్‌ నమోదైంది. ఇది ఢిల్లీ చరిత్రలోనే రికార్డని డిస్కం అధికారులు చెప్పారు.సాయంత్రం భారీ వర్షం ఢిల్లీలో బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. 52.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన రెండు గంటల తర్వాత వర్షం ప్రారంభమైంది. దీంతో ప్రజలు కొంత ఉపశమనం పొందారు. రెండు, మూడు రోజుల్లో వర్షాలు అరేబియా సముద్రంలో ఏర్పడిన వాయుగుండం నేపథ్యంలో వాయువ్యం నుండి తూర్పు దిశగా వీచే గాలుల కారణంగా గరిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుతాయని ఐఎండీ తెలిపింది. వచ్చే రెండు, మూడు రోజుల్లో ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, ఢిల్లీ, హరియాణా రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది.

Agnibaan Rocket Launched Successfully
అగ్నిబాణ్‌ రాకెట్ ప్రయోగం సక్సెస్‌

సాక్షి, తిరుపతి: అగ్నిబాణ్‌ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌) నుంచి ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ప్రెవేట్ రాకెట్ ప్రయోగ వేదికపై నుంచి ఉదయం 7 గంటల 15 నిమిషాలకు అగ్నిబాన్ రాకెట్ ప్రయోగం చేశారుఈ ప్రయోగం విజయంతో ప్రెవేటు రాకెట్ ప్రయోగాల పరంపర మొదలైందని ఇస్రో అధికారులు తెలిపారు. భవిష్యత్లో 300 కిలోల లోపు చిన్న తరహా ఉపగ్రహాలను లోఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెట్టడానికి ఈ తరహా ప్రయోగం చేప్టటింది ఇస్రో. కాగా, ప్రైవేటు స్టార్టప్‌ కంపెనీ అగ్నికుల్‌ కాస్మోస్‌ ఈ రాకెట్‌ను రూపొందించింది. దేశంలోనే తొలి సెమీ క్రయోజనిక్ ఇంజిన్ ఆధారిత రాకెట్‌గా ఇది రికార్డులకెక్కింది. కాగా ఇప్పటికే 3సార్లు వాయిదా పడిన ఈ రాకెట్ ప్రయోగం ఎట్టకేలకు విజయవంతమైంది.

Gayatri Gupta Comment On Sai Rajesh
సాయి రాజేష్‌ పాము లాంటి వ్యక్తి.. గాయత్రి సెన్సేషనల్‌ కామెంట్స్‌

బేబీ సినిమా కథ నాదేనంటూ షార్ట్‌ ఫిలిం డైరెక్టర్‌, సినిమాటోగ్రాఫర్‌ శిరిన్‌ శ్రీరామ్‌ కొన్నిరోజులుగా పోరాడుతున్నాడు. గతేడాదిలో ఆనంద్‌ దేవరకొండ , వైష్ణవి చైతన్య , విరాజ్‌ ఆనంద్‌ ప్రధాన పాత్రల్లో నటించిన 'బేబీ' చిత్రాన్ని సాయి రాజేశ్‌ దర్శకత్వం వహిస్తే ఎస్‌కేఎన్‌ నిర్మాతగా తెరకెక్కించారు. అయితే, ఈ కథ మొత్తం తనదే అంటూ ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేశ్‌ బేబి సినిమా తీశాడని దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ విషయంపై సాక్ష్యాల‌తో స‌హా సాయి రాజేష్ మీద ‘బేబీ లీక్స్ అనే బుక్‌ను వెబ్‌సైట్‌లో https://babyleaks2023.blogspot.com/ అందుబాటులోకి తీసుకొచ్చాడు.బేబీ సినిమా డైరెక్టర్‌ సాయి రాజేష్ చేసిన మోసం, దానికి సంబంధించిన సాక్ష్యాలను బేబీ లీక్స్ అంటూ పుస్తకరూపంలో తీసుకొచ్చారు. ఈ బేబీ లీక్స్ బుక్‌ను మీడియా ముందుంచారు. అయితే, తాజాగా సినీ నటి గాయత్రి గుప్తా కూడా ఈ అంశంపై రియాక్ట్‌ అయింది. ఫిదా సినిమాతో పాపులర్‌ అయిన గాయత్రి.. ఐస్‌ క్రీమ్ 2, కొబ్బరిమట్ట, మిఠాయి లాంటి సినిమాల్లో నటించింది. బేబీ డైరెక్టర్‌ సాయి రాజేష్ గురించి గాయత్రి ఇలా చెప్పుకొచ్చింది. 'బేబీ సినిమా కథను ప్రేమించొద్దు అనే పేరుతో శిరిన్‌ శ్రీరామ్‌ రాసుకున్నారు. దానిని సాయి రాజేష్‌ కాపీ కొట్టేశాడు. ఈ సినిమాలో మొదటగా హీరోయిన్‌గా నన్ను అనుకున్నారు. అందుకు ఆడిషన్‌ కూడా జరిగింది. స్కూల్‌ డ్రెస్‌లో ఉన్న ఆ ఫోటోలను సాయి రాజేష్‌కు చూపించాను. దానినే బేబీలో కాపీ కొట్టాడు. ట్రైలర్‌ విడుదల అయ్యాక చూసి నేను షాక్‌ అయ్యాను. సాయి రాజేష్‌తో ఇబ్బందులు నాకు కొత్త కాదు. ఆయన డైరెక్ట్‌ చేసిన కొబ్బరిమట్టలో కూడా నన్ను ఇబ్బంది పెట్టాడు. ఆ సినిమాకు సంబంధించి రూ. 3లక్షలు ఇస్తానన్నారు. కానీ, కేవలం రూ.25 వేలు ఇచ్చి బాగా టార్చర్‌ పెట్టారు. అవన్నీ సరేలే అనుకుంటే.. బేబీ కథను మొదట రాసుకుంది శిరిన్‌. కానీ, సాయి రాజేష్‌ మాత్రం ఆ కథను తానే క్రియేట్‌ చేశానంటాడు. ఇద్దరూ కలిసి ఆ కథతో సినిమా తీద్దామని చివరి క్షణంలో బడ్జెట్‌ లేదని తెలివిగా శిరిన్‌ను తప్పించాడు. అదే కథను శిరిన్‌ నుంచి సాయి రాజేష్‌ కాపీ కొట్టేసి.. గీతా ఆర్ట్స్‌లో చర్చలు జరిపాడు. ఆ సంస్థ చాలా మంచిది. కానీ, పాము లాంటి సాయి రాజేష్‌ను వారు గుర్తించాలి. బేబీ సినిమా కోసం సాయి రాజేష్‌ చాలా చీప్‌ ట్రిక్స్‌ చేశాడు. బేబీ పాత్రను చాలా దారుణంగా చూపించాడు. కొందరైతే హీరోయిన్‌ పోస్టర్‌ను చెప్పులతో కూడా కొట్టారు. అంతలా ఆయన పబ్లిసిటీని ఉపయోగించుకున్నాడు. సాయి రాజేష్‌ లాంటి వ్యక్తి టాలీవుడ్‌కు మచ్చలా మిగిలిపోతాడు. బేబీ కథ రాసుకున్న శిరిన్‌ శ్రీరామ్‌కు న్యాయం జరిగాలి.' అని కోరుకుంటున్నట్లు ఆమె తెలిపింది.

AP Elections 2024: May 30th Political Updates In Telugu
May 30th: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 30th AP Elections 2024 News Political Updates..11:16 AM, May 30th, 2024తిరుపతి: చంద్రగిరి డీఎస్పీ శరత్‌ రాజ్‌కుమార్‌పై చర్యలుడీఎస్పీ శరత్ రాజ్ కుమార్ డీజీపి కార్యాలయంలో సరెండర్ కావాలంటూ ఆదేశాలుమూడు నెలల క్రితమే చంద్రగిరి డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శరత్ రాజ్ కుమార్చంద్రగిరి నియోజకవర్గంలో శాంతిభద్రతలు కాపాడటంలో డీఎస్పీ విఫలంపోలింగ్‌ రోజు జరిగిన ఘర్షణలపై సిట్‌ నివేదిక ఆధారంగా చర్యలు7:18 AM, May 30th, 2024సరిగ్గా ఐదేళ్ల క్రితం.. ప్రజా పరిపాలనకు శ్రీకారం2019లో 151 శాసనసభ, 22 లోక్‌సభ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయంఅదే ఏడాది మే 30న ‘జగన్‌ అనే నేను’.. అంటూ సీఎంగా వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారంరాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించేలా ఐదేళ్లుగా ఆయన పరిపాలనఈ పాలన కొనసాగాలని కోరుకుంటూ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి దన్నుగా నిలిచిన జనంగత ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో అధిక స్థానాలతో వైఎస్సార్‌సీపీ చారిత్రక విజయం ఖాయమంటున్న రాజకీయ పరిశీలకులు7:11 AM, May 30th, 2024మధ్యాహ్నం 2 గంటలకే 111 అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాల వెల్లడి111 నియోజకవర్గాల్లో 20 లోపు రౌండ్లు.. 61 నియోజకవర్గాల్లో 21 నుంచి 24 రౌండ్లు3 నియోజకవర్గాల్లో 25 రౌండ్లకు మించి ఓట్ల లెక్కింపురాత్రి 9 గంటల్లోగా అన్ని నియోజకవర్గాల ఫలితాల ప్రకటనసీనియర్‌ డిప్యూటీ ఎన్నికల కమిషనర్‌ నితీష్‌ వ్యాస్‌కు ఏపీ సీఈవో మీనా వెల్లడిజాప్యం లేకుండా లెక్కింపు జరగాలి.. ఫలితాలు కచ్చితంగా ఉండాలిఓట్ల లెక్కింపుపై అభ్యర్థులు, ఏజెంట్లకు అవగాహన కల్పించండిగుర్తింపు కార్డులు ఉన్నవారినే లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించాలిరాష్ట్ర అధికారులకు నితీష్‌ వ్యాస్‌ ఆదేశం 7:05 AM, May 30th, 2024ఓట్ల లెక్కింపులో ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: సజ్జల రామకృష్ణారెడ్డిఎన్నికల నియమ నిబంధనలను క్షుణ్ణంగా తెలుసుకోవాలిప్రత్యర్ధి పార్టీల ఏజెంట్ల పట్ల అత్యంత అప్రమత్తతతో ఉండాలివైఎస్సార్‌సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందిజూన్‌ 9న సీఎంగా జగన్‌ మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తారు7:02 AM, May 30th, 2024‘సడలింపు’ని సరిదిద్దండికేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదుపోస్టల్‌ బ్యాలెట్‌ నిబంధనల మినహాయింపులపై ఆక్షేపణఈసీఐ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సడలింపులుఅటెస్టింగ్‌ అధికారుల స్పెసిమన్‌ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధంఇది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను తిరస్కరించేందుకు దారితీస్తుందంటూ ఆందోళనసడలింపు ఉత్తర్వులను తక్షణమే సమీక్షించి, తగు నిర్ణయం తీసుకోవాలని వినతి

Aditi Dugar: Masque In The World's 50 Best Restaurants List
Aditi Dugar: జీరో టు.. మ.. మ.. మాస్క్‌ వరకు!

‘రెస్టారెంట్‌ మేనేజ్‌మెంట్‌’ అంటే రెస్టారెంట్‌కు వెళ్లి ఇష్టమైన ఫుడ్‌ తిన్నంత ఈజీ కాదు. ఎన్నో సవాళ్లు వేడి వేడిగా ఎదురవుతుంటాయి. చల్లని ప్రశాంత చిత్తంతో వాటిని అధిగమిస్తేనే విజయం చేతికి అందుతుంది. ‘యాక్సిడెంటల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌’గా తనను తాను పరిచయం చేసుకునే అదితి దుగర్‌కు వ్యాపారంలో ఎలాంటి అనుభవం లేకపోయినా రెస్టారెంట్‌ బిజినెస్‌లోకి వచ్చింది. అయితే ఆమె ‘జీరో’ దగ్గరే ఉండిపోలేదు. కాలంతోపాటు ఎన్నోపాఠాలు నేర్చుకొని ఎంటర్‌ప్రెన్యూర్‌గా విజయ ఢంకా మోగించింది. ముంబైలో అదితి నిర్వహిస్తున్న ‘మాస్క్‌’ వరల్డ్స్‌ 50 బెస్ట్‌ రెస్టారెంట్స్‌ జాబితాలో చోటు సాధించింది. మనదేశంలో నంబర్‌వన్‌ రెస్టారెంట్‌గా గుర్తింపు పొందింది.కొన్ని సంవత్సరాల క్రితం...ముంబైలోని మహాలక్ష్మి ప్రాంతంలో ‘మాస్క్‌’ పేరుతో అదితి దుగర్‌ ఫైన్‌–డైనింగ్‌ రెస్టారెంట్‌ ప్రారంభించింది. అయితే ఈ రెస్టారెంట్‌ వ్యవహారం ఆమె మామగారికి బొత్తిగా నచ్చలేదు. సంప్రదాయ నిబద్ధుడైన ఆయన రెస్టారెంట్‌లోకి అడుగు కూడా పెట్టలేదు. అలాంటి మామగారు కాస్తా ‘మాస్క్‌’ రెస్టారెంట్‌ తక్కువ సమయంలోనే బాగాపాపులర్‌ కావడం గురించి విని సంతోషించడమే కాదు రెస్టారెంట్‌కి వచ్చి భోజనం చేశాడు. తన స్నేహితులను కూడా రెస్టారెంట్‌కు తీసుకు వస్తుంటాడు.తన కోడలు గురించి ఆయన ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటాడు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వంటకాలను పరిచయం చేయడంతో ‘మాస్క్‌’ దూసుకుపోయింది. మోస్ట్‌ ఫార్వర్డ్‌ – థింకింగ్‌ ఫైన్‌–డైనింగ్‌ రెస్టారెంట్‌గా పేరు తెచ్చుకుంది. ఉమ్మడి కుటుంబ వాతావరణంలో పెరిగిన అదితి ఎన్నో వంటకాల రుచుల గురించి పెద్దల మాటట్లో విన్నది. అలా వంటలపై తనకు తెలియకుండానే ఇష్టం ఏర్పడింది. ఇద్దరు పిల్లల తల్లిగా నాలుగు సంవత్సరాలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. ఆ తరువాత కేటరింగ్‌పై దృష్టి పెట్టింది.ఇంటి నుంచే మొదలుపెట్టిన కేటరింగ్‌ వెంచర్‌తో ఎంటర్‌ప్రెన్యూర్‌గా తొలి అడుగు వేసింది అదితి. ఆహా ఏమి రుచి అనిపించేలా వంటకాల్లో దిట్ట అయిన తల్లి ఎన్నో సలహాలు ఇచ్చేది. ఒకవైపు తల్లి నుంచి సలహాలు తీసుకుంటూనే మరోవైపు ΄్యాకేజింగ్‌ నుంచి మార్కెటింగ్‌ వరకు ఎన్నో విషయాల్లో తీరిక లేకుండా గడిపేది అదితి.క్యాటరింగ్‌ అసైన్‌మెంట్స్‌లో భాగంగా అదితి ఒక బ్రిటిష్‌ హోం చెఫ్‌తో కలిసి పనిచేయాల్సి వచ్చింది. అయితే ఇది తన తల్లిదండ్రులు, అత్తమామలకు ఎంతమాత్రం నచ్చలేదు. దీనికి కారణం అతడు నాన్‌–వెజ్‌ చెఫ్‌ కావడమే. అయితే ఆ సమయంలో భర్త ఆదిత్య అదితికి అండగా నిలబడ్డాడు. అత్తమామలు, తల్లిదండ్రులకు నచ్చచెప్పాడు. ఒకవేళ అదిత్య కూడా అసంతృప్తి బృందంలో ఉండి ఉంటే అదితి ప్రయాణం ముందుకు వెళ్లేది కాదు. అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేది కాదు. ‘ఆ సమయంలో ఆదిత్య నాకు అండగా నిలబడకుంటే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు’ అంటుంది అదితి.‘అదితి విషయంలో నేను ఎప్పుడూ నో చెప్పలేదు. ఎందుకంటే ఆమె తప్పు చేయదు అనే బలమైన నమ్మకం ఉంది. ఏది చేసినా ఒకటికి రెండుసార్లు ఆలోచించి చేస్తుంది. ఆమె ఆలోచనల్లో పరిణతి ఉంది’ అంటాడు మెచ్చుకోలుగా ఆదిత్య. ‘కొత్తగా ఆలోచించేవాళ్లకు తగిన స్వేచ్ఛ ఇచ్చి అడిగినవి సమకూర్చితే అద్భుతమైన ఫలితాలు చూపించగలరు’ అనే ఆదిత్య మాటను అక్షరాలా నిజం చేసింది అదితి. ఫ్యామిలీ హాలిడే ట్రిప్‌లో స్పెయిన్‌లో ఉన్న అదితికి ‘మాస్క్‌’ ఐడియా తట్టింది. అక్కడి నుంచి తిరిగి వచ్చిన తరువాత తన కలకు శ్రీకారం చుట్టింది. ‘ఫలానా దేశంలో ఫలానా వంటకం అద్భుతంగా ఉంటుంది. ఆ వంటకం మీ రెస్టారెంట్‌లో అందుబాటులో ఉండే బాగుంటుంది’... ఇలాంటి సలహాలు ఎన్నో కేటరింగ్‌ క్లయింట్స్‌ నుంచి వచ్చేవి.ఎంతోమంది సలహాలు, సూచనలతో ‘మాస్క్‌’ మొదలై విజయం సాధించింది. అయితే ‘మాస్క్‌’ వేగానికి కోవిడ్‌ సంక్షోభం అడ్డుపడింది.‘కోవిడ్‌ సంక్షోభం వల్ల ఆర్థికంగా నష్టం వచ్చినప్పటికీ విలువైనపాఠాలు ఎన్నో నేర్చుకున్నాను. ఒక్క ముక్కలో చె΄్పాలంటే కోవిడ్‌ అనేది మా వ్యాపారానికి సంబంధించి స్పష్టతను ఇచ్చింది’ అంటుంది అదితి.ఒక్కసారి వెనక్కి వెళితే...‘మాస్క్‌ పేరుతో డబ్బులు వృథా చేసుకోకండి. మీకు రెస్టారెంట్‌ బిజినెస్‌లో జీరో అనుభవం ఉంది. వ్యాపారంలో మీకు నష్టం తప్ప ఏమీ మిగలదు’ అన్నారు చాలామంది. ‘దశాబ్దాల అనుభవం ఉన్న వ్యాపారులైనా జీరో నుంచే మొదలవుతారు’ అనే విషయం అదితికి తెలియనిది కాదు. ‘జీరో’ నుంచి మొదలైన ఆమె ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే స్థాయికి చేరింది. అదితి దుగర్‌ విజయం ఎంతోమందికి స్ఫూర్తిని ఇస్తోంది.‘దశాబ్దాల అనుభవం ఉన్న వ్యాపారులైనా జీరో నుంచే మొదలవుతారు’ అనే విషయం అదితికి తెలియనిది కాదు. ‘జీరో’ నుంచి మొదలైన ఆమె ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే స్థాయికి చేరింది. – అదితి దుగర్‌

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement