Kane Williamson: ఒత్తిడి పెంచాం... సఫలమయ్యాం.. సంతోషంగా ఉంది!

T20 World Cup 2021 Ind Vs NZ: Kane Williamson Comments Big Win On India - Sakshi

T20 World Cup 2021 Ind Vs NZ- Kane Williamson Comments: టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీలో సెమీస్‌ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ సత్తా చాటింది. టాస్‌ గెలిచిన కివీస్‌... టీమిండియాపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బ్యాటర్లను న్యూజిలాండ్‌ బౌలర్లు కట్టడి చేయగా... కివీస్‌ బ్యాటర్లు సైతం మెరుగ్గా రాణించడంతో ఆడుతూ పాడుతూ విజయం సాధించింది.

ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశాడు. ‘‘మ్యాచ్‌లో మేం సరైన ప్రణాళికలతో బరిలోకి దిగాం. భారత్‌లాంటి పటిష్ట జట్టుపై ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో గెలవడం సంతోషకరం. మ్యాచ్‌ ఆసాంతం వారిపై ఒత్తిడి పెంచడంలో సఫలమయ్యాం. బ్యాటింగ్‌లో మా ఓపెనర్లు చెలరేగి గెలుపునకు చేరువగా తెచ్చారు.

స్పిన్నర్లు కీలక పాత్ర పోషించగా, ఇది సమష్టి విజయం. ఇలాంటి ప్రత్యర్థిపై ఆడుతున్నప్పుడు మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. మేం అది చేయగలిగాం. ఇష్‌ సోధికి నా ప్రత్యేక అభినందనలు. అతను గతంలో ఎన్నో సార్లు తన ప్రదర్శనతో మ్యాచ్‌లు గెలిపించాడు’ అని ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ఇష్‌ సోధిపై ప్రశంసలు కురిపించాడు.

భారత్‌కు కివీస్‌ చేతిలో చేదు అనుభవాలు
 టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో మూడు సార్లు తలపడిన భారత్‌ ప్రతీ సారి ఓడింది. గతంలో 2007, 2016 వరల్డ్‌ కప్‌లలో ఇదే ఫలితం వచ్చింది.

కివీస్‌ ఇద్దరు స్పిన్నర్లు సోధి, సాన్‌ట్నర్‌ 8 ఓవర్లలో 32 పరుగులే ఇచ్చారు. వీరి బౌలింగ్‌లో భారత్‌ ఒక్క ఫోర్‌ గానీ, ఒక్క సిక్స్‌ గానీ కొట్టలేకపోయింది. టి20 ప్రపంచకప్‌లో ఇలా జరగడం ఇది రెండో సారి మాత్రమే. 2009లో దక్షిణాఫ్రికా స్పిన్నర్ల బౌలింగ్‌లో స్కాట్లండ్‌ ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయింది.

చదవండి: Virat kohli: అలా చేయలేకపోయాం.. అందుకే రెండింటిలో ఓడిపోయాం.. అయితే 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top