IND vs SL 3rd ODI: పద్మనాభస్వామి ఆశీస్సులు తీసుకున్న భారత క్రికెటర్లు

Surya, Shreyas, Axar, Kuldeep, Chahal visit Sree Padmanabhaswamy Temple - Sakshi

తిరువనంతపురం వేదికగా ఆదివారం (జనవరి15) శ్రీలంకతో నామమాత్రపు మాడో వన్డేలో టీమిండియా తలపడనుంది. మూడో వన్డేలో కూడా గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని రోహిత్‌ సేన భావిస్తుంటే.. కనీసం ఆఖరి వన్డేలోనైనా విజయం సాధించి పరువు నిలబెట్టకోవాలని భావిస్తోంది. ఇక ఇప్పటికే తిరువనంతపురంకు చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగితేలుతున్నాయి.

ఈ ​క్రమంలో భారత ఆటగాళ్లు కొంతమంది శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని సందర్శించారు. వారిలో  సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. వీరందరూ సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారిని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తమ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. 

మూడో వన్డేకు తుది జట్లు(అంచనా)
భారత్‌: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్‌ కిషన్‌, విరాట్ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌,, కేెెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, మహమ్మద్ షమీ.

శ్రీలంక: అవిష్క ఫెర్నాండో, నువానిడు ఫెర్నాండో, చరిత్ అసలంక, దసున్ శనక (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వికెట్ కీపర్), ధనంజయ డిసిల్వా, చమిక కరుణరత్నే, వానిందు హసరంగా, కసున్ రజిత, లాహిరు కుమార, దునిత్ వెలాలెజ్. 
చదవండి:
 SL vs IND: శ్రీలంకతో మూడో వన్డే.. గిల్, శ్రేయస్‌కు నో ఛాన్స్! కిషన్‌, సూర్య ఎంట్రీ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top