ఒక్కరోజులో రూ. 9.5 కోట్ల లాభం కళ్లజూసిన స్టీవ్‌ స్మిత్‌! | Steve Smith Richer By Rs 9.5 Crore In Just 1 Day Due To Brilliant Decision, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఒక్కరోజులో రూ. 9.5 కోట్ల లాభం కళ్లజూసిన స్టీవ్‌ స్మిత్‌!

Mar 31 2026 7:43 PM | Updated on Mar 31 2026 8:11 PM

Smith Richer By Rs 9 5 Crore in Just 1 Day Due To Brilliant Decision

స్టీవ్‌ స్మిత్‌.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. తన అద్భుతమైన నైపుణాల్యతో ప్రపంచంలోని మేటి క్రికెటర్లలో ఒకడిగా పేరొందాడు ఈ ఆస్ట్రేలియా స్టార్‌. నవతరం క్రికెట్‌లో టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి, న్యూజిలాండ్‌ లెజెండ్‌ కేన్‌ విలియమ్సన్‌, ఇంగ్లండ్‌ దిగ్గజం జో రూట్‌తో కలిసి ఫ్యాబ్‌-4లో ఒకడిగా కొనసాగుతున్నాడు.

ఒక్కరోజులోనే రూ. 9.5 కోట్ల లాభం!
ఆస్ట్రేలియా కెప్టెన్‌గానూ చిరస్మరణీయ విజయాలు అందుకున్న స్మిత్‌ (Steve Smith).. మైదానం వెలుపలా ‘స్మార్ట్‌ ఆపరేటర్‌’ అని నిరూపించుకున్నాడు. స్మిత్‌కు ముందు చూపు ఎక్కువ. మార్కెట్‌పైనా అవగాహన ఉంది. అందుకే ఒక్కరోజులోనే అతడు ఏకంగా రూ. 9.5 కోట్ల మొత్తం లాభం కళ్లజూశాడు. ఇదెలా సాధ్యమైందంటే..

ఎలా సాధ్యమైందంటే
ఓ ఆన్‌లైన్‌ బెడ్డింగ్‌, ఫర్మీచర్‌ రిటైలర్‌ కంపెనీలో స్మిత్‌ 2015లో లక్ష డాలర్ల (ఆస్ట్రేలియన్‌ డాలర్లు) మేర పెట్టుబడి పెట్టాడు. ప్రస్తుతం ఈ కంపెనీలో అతడికి 3.9 శాతం వాటా ఉంది. ఈ కంపెనీ మంగళవారం ఆస్ట్రేలియన్‌ సెక్యూరిటీస్‌ ఎక్స్ఛేంజ్‌లో లిస్ట్‌ అయింది. ఈ క్రమంలో స్మిత్‌ వాటా విలువ 11.9 మిలియన్‌ డాలర్లుగా ఉండగా.. మార్కెట్‌ ముగిసేసరికి దీని విలువ 13.2 మిలియన్‌ డార్లకు చేరింది.

తద్వారా స్మిత్‌ ఒక్కరోజులోనే సుమారుగా 1.4 మిలియన్‌ డాలర్ల మేర లాభం పొందినట్లు నైన్‌.కో.ఏయూ వెల్లడించింది. కాగా ఆన్‌లైన్‌ బెడ్డింగ్‌, ఫర్మీచర్‌ రిటైలర్‌ కంపెనీలోనే కాకుండా పలు ఇతర సంస్థల్లోనూ స్మిత్‌ పెట్టుబడులు పెట్టాడు. ఓట్‌ మిల్క్‌ గుడ్నెస్‌ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడు కూడా!

కాగా స్మిత్‌ కెరీర్‌ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా తరఫున 2010లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు 123 టెస్టుల్లో 10763, 170 వన్డేల్లో 5800, టీ20లలో 1094 పరుగులు సాధించాడు కుడిచేతి వాటం బ్యాటర్‌. ఇక 36 ఏళ్ల స్మిత్‌ చివరగా ఇంగ్లండ్‌తో యాషెస్‌ టెస్టు సిరీస్‌లో భాగంగా ఈ ఏడాది జనవరిలో ఆసీస్‌ తరఫున బరిలోకి దిగాడు.

గమనిక: స్మిత్‌ పెట్టుబడుల ద్వారా పొందిన లాభం గురించి మాత్రమే వార్త ఇవ్వడం జరిగింది. దీని ద్వారా సాక్షి.కామ్‌ ఎలాంటి పెట్టుబడులను ప్రోత్సహించడం లేదు.

చదవండి: ఇంగ్లండ్‌ టూర్‌కు వైభవ్‌ సూర్యవంశీని పంపండి: మైకేల్‌ వాన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement