
టీ20ల్లో టీమిండియా వెటరన్ ఓపెనర్, పంజాబ్ కింగ్స్ స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్ అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్--2022లో భాగంగా సీఎస్‌కేతో మ్యాచ్‌లో ధావన్ 9 వేల పరుగుల మైలు రాయిని అందుకున్నాడు.
తద్వారా టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. కాగా 10392 పరుగులతో విరాట్ కోహ్లి తొలి స్థానంలో కొనసాగుతుండగా.. 10048 పరుగులతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు.
చదవండి: IPL 2022: టీ20ల్లో చరిత్ర సృష్టించిన ధావన్.. తొలి భారత ఆటగాడిగా!