Santosh Trophy 2023: సంతోష్‌ ట్రోఫీ ఫైనల్‌.. 54 ఏళ్ల నిరీక్షణకు తెర

Santosh Trophy 2023: Karnataka Beats Meghalaya 3-2 Clinch Title-54 Years - Sakshi

దేశవాలీ ఫుట్‌బాల్‌ టోర్నీ సంతోష్‌ ట్రోఫీని కర్ణాటక సొంతం చేసుకుంది. 54 ఏళ్ల సుధీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ టోర్నీలో విజేతగా నిలవడం విశేషం. శనివారం రాత్రి మేఘాలయాతో జరిగిన ఫైనల్‌ పోరు నువ్వా-నేనా అన్నట్లుగా సాగింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో కర్ణాటక 3-2 తేడాతో మేఘాలయాను ఓడించి కప్‌ను కైవసం చేసుకుంది.

కర్ణాటక తరపున సునీల్‌ కుమార్‌(ఆట 3వ నిమిషం), బెకి ఓరమ్‌(20వ నిమిషం), రాబిన్‌ యాదవ్‌(44వ నిమిషం) గోల్స్‌ చేయగా.. మేఘాలయ తరపున బర్లింగ్టన్(8వ నిమిషం), షీన్‌(60వ నిమిషం) రెండు గోల్స్‌ కొట్టారు.

అయితే ఆట తొలి సగంలోనే ఇరజట్లు కలిపి నాలుగు గోల్స్‌ కొడితే.. అందులో మూడు కర్ణాటక చేయగా.. ఒకటి మేఘాలయ ఖాతాలోకి వెళ్లింది. అయితే రెండో సగంలో మేఘాలయా మరొక గోల్‌ చేసినప్పటికి కర్ణాటక డిఫెన్స్‌ను నిలువరించలేక చేతులెత్తేసింది. ఇక కర్ణాటక 1968-69 సీజన్‌లో తొలిసారి సంతోష్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది.

చదవండి: సీఎస్‌కే కెప్టెన్‌గా బెన్‌ స్టోక్స్!?

ఫ్రాన్స్‌ స్టార్‌ ఎంబాపె కొత్త చరిత్ర..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top