రొమారియో షెపర్డ్ అరుదైన రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలోనే | Sakshi
Sakshi News home page

IPL 2024: రొమారియో షెపర్డ్ అరుదైన రికార్డు.. ఐపీఎల్‌ చరిత్రలోనే

Published Sun, Apr 7 2024 6:46 PM

Romario Shepherd multiple IPL records after last-over carnage vs DC - Sakshi

ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖడే వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఆటగాడు రొమారియో షెపర్డ్ మెరుపులు మెరిపించాడు. ఈ ఏడాది సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న షెపర్డ్‌ ఢిల్లీ బౌలర్లను ఊచకోత కోశాడు. ముఖ్యంగా ఢిల్లీ పేసర్‌ అన్రిచ్‌ నోర్జేకు అయితే షెపర్డ్‌ చుక్కలు చూపించాడు.

ముంబై ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ వేసిన నోర్జే బౌలింగ్‌లో 4 సిక్స్‌లు, రెండు ఫోర్లతో రొమారియా ఏకంగా 32 పరుగులు రాబట్టాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 10 బంతులు మాత్రమే ఎదుర్కొన్న రొమారియో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 39 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన షెపర్డ్.. ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

ఐపీఎల్‌ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్ట్రైక్ రేట్‌తో ఆడిన ఆటగాడిగా షెపర్డ్ రికార్డులకెక్కాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో షెపర్డ్ 390.0 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్‌ చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమ్మిన్స్‌(373.3) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో కమ్మిన్స్ ఆల్‌టైమ్‌ రికార్డును రొమారియో బ్రేక్‌ చేశాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement