Ricky Ponting: చాలా మందిని భయపెట్టా.. నాకు కూడా భయమేసింది.. ఇప్పుడిలా!

Ricky Ponting returns to commentary box after health scare - Sakshi

అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ కోలుకున్నాడు. ఆస్పత్రి నుంచి డిచ్చార్జ్‌ అయిన పాంటింగ్‌ తిరిగి మళ్లీ కామెంటేటర్‌గా బాధ్యతలు చేపట్టాడు. కాగా ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో కామెంటేటర్‌గా వ్యవహారిస్తున్న పాంటింగ్‌ ఛాతి నోప్పితో బాధపడ్డాడు. దీంతో హుటాహుటిన అతడిని పెర్త్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు.

పాంటింగ్ గుండెపోటుకు గురయ్యారనే వార్తతో అతడి అభిమానులు ఆందోళన చెందారు. ఇప్పుడు అతడు కోలుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే  పాంటింగ్‌ ఆస్పత్రి నుంచి డిచ్చార్జ్‌ అయ్యి విశ్రాంతి తీసుకుంటాడని అంతా భావించారు. కానీ అతడు తిరిగి మళ్లీ  కామెంటరీ బ్యాక్స్‌లో కనిపించి అందరనీ ఆశ్చర్యపరిచాడు. ఇక పాంటింగ్‌ కూడా తన ఆరోగ్యం గురించి పలు విషయాలను అభిమానులతో పంచుకున్నాడు.

"నేను నిన్న(నవంబర్‌ 02) చాలా మందిని భయపెట్టాను. నిజం చెప్పాలంటే నాకు కూడా కొంచెం భయంగానే ఉండేది. నేను కామ్‌ బ్యాక్స్‌లో ఉండగా.. ఛాతిలో చిన్నగా నొప్పి మొదలైంది. నొప్పి వస్తుండడంతో కామెంటరీ కూడా ఎక్కువగా ఇవ్వలేదు. ఆఖరికి కామ్‌ బ్యాక్స్‌ను విడిచి పెట్టి వెళ్లిపోదామని నిర్ణయించకున్నాను.

ఈ ‍క్రమంలో కూర్చోని లేచిన వెంటనే ఒక్క సారిగా మైకంలోకి వెళ్లినట్లు అనిపించింది. వెంటనే అక్కడ ఉన్న బెంచ్‌ను పట్టుకున్నాను. ఆ సమయంలో నా సహచరలు లాంగర్‌, క్రిస్‌ జోన్స్‌ వెంటనే నన్ను ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఇప్పుడు నా ఆరోగ్యం నిలకడగా ఉంది. మళ్లీ నేను వాఖ్యతగా నా బాధ్యతలు నిర్వర్తిస్తాను" అని ఛానల్ సెవెన్‌తో పేర్కొన్నారు.

కాగా ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్లలో పాంటింగ్‌ ఒకడు. ఆస్ట్రేలియా తరపున 168 టెస్టుల్లో 13,378 పరుగులు... 375 వన్డేల్లో 13,704 పరుగులు చేశారడు. టెస్టుల్లో 41 సెంచరీలు, వన్డేల్లో 30 శతకాలను సాధించారు. అదే విధంగా ఆస్ట్రేలియాకు రెండు ప్రపంచ కప్ లను కెప్టెన్‌గా పాంటింగ్‌ అందించాడు.
చదవండిIND vs BAN: షమీకి గాయం.. అతడి స్థానంలో యంగ్‌ బౌలర్‌.. బీసీసీఐ ప్రకటన

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top