Ashwin Vs Morgan: మోర్గాన్‌ అనవసరంగా గెలికాడు.. తన పవరేంటో చూపించాడు

Ravichandran Ashwin Roars Eoin Morgan Duck Out After Heat Argument Viral - Sakshi

Ashwin Roars After Eoin Morgan Duck Out.. ఐపీఎల్‌ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ దెబ్బకు దెబ్బ తీశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా సౌథీ, అశ్విన్‌ల మధ్య మాటలయుద్ధం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ గొడవలో మోర్గాన్‌ దూరి సౌథీకి మద్దతు పలుకుతూ మాట్లాడడంతో ఆశ్విన్‌ మోర్గాన్‌కు బ్యాట్‌ చూపిస్తూ కోపంగా వెళ్లిపోయాడు. అయితే అశ్విన్‌ తప్పు లేకపోయిన కావాలనే రెచ్చగొట్టడంతో తనను గెలికితే ఎలా ఉంటుందో మోర్గాన్‌కు రుచి చూపించాడు.

చదవండి: IPL 2021: డెబ్యూ మ్యాచ్‌లోనే గొడవ.. మోర్గాన్‌ మద్దతు


Courtesy: IPL Twitter

కేకేఆర్‌ ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో మోర్గాన్‌ క్రీజులోకి వచ్చాడు. ఆ ఓవర్‌ అశ్విన్‌ బౌలింగ్‌ చేశాడు. అశ్విన్‌ వేసిన ఓవర్‌ రెండో బంతిని మోర్గాన్‌ లెగ్‌సైడ్‌ ఆడగా..  స్లిప్‌లో ఉన్న లలిత్‌ యాదవ్‌కు క్యాచ్‌ తీసుకోవడంతో డకౌట్‌గా వెనుదిరిగాడు. దీంతో అశ్విన్‌ మోర్గాన్‌పై కోపాన్ని చూపిస్తూ గట్టిగా అరుస్తూ పెవిలియన్‌కు వెళ్లు అని అరుస్తూ చెప్పాడు. ఇక మ్యాచ్‌లో కేకేఆర్‌ విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. అనంతరం 128 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన కేకేఆర్‌ 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top