లార్డ్స్‌లో కలిసి మ్యాచ్ చూసిన రవిశాస్త్రి, సుందర్ పిచాయ్, ముఖేష్ అంబానీ ..! | Ravi Shastri enjoys with Mukesh Ambani and Sundar Pichai In Lords | Sakshi
Sakshi News home page

లార్డ్స్‌లో కలిసి మ్యాచ్ చూసిన రవిశాస్త్రి, సుందర్ పిచాయ్, ముఖేష్ అంబానీ..!

Published Tue, Aug 9 2022 9:20 PM | Last Updated on Tue, Aug 9 2022 9:41 PM

Ravi Shastri enjoys with Mukesh Ambani and Sundar Pichai In Lords - Sakshi

టీమిండియా మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి ప్రస్తుతం ఇంగ్లండ్‌ క్రికెట్‌ టోర్నీ ది హండ్రెడ్ లీగ్‌లో కామెంటేటర్‌ వ్యవహారిస్తున్నాడు. ఈ లీగ్‌లో భాగంగా సోమవారం లార్డ్స్‌ వేదికగా లండన్ స్పిరిట్, మాంచెస్టర్ ఒరిజినల్స్ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్‌తో కలిసి రవిశాస్త్రి వీక్షించాడు.

ఇందుకు సంబంధించిన ఫోటోను రవిశాస్త్రి తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌ చేశాడు. "క్రికెట్‌ను ఎక్కువగా ఇష్టపడే ముఖేష్ అంబానీ, సుందర్ పిచాయ్‌తో క్రికెట్‌ పుట్టినిల్లు లార్డ్స్‌లో మ్యాచ్‌ చూడడం చాలా సంతోషంగా ఉంది" అంటూ ఈ పోస్ట్‌కు రవిశాస్త్రి క్యాప్షన్‌గా పెట్టాడు. కాగా వ్యక్తిగత కారణాలతో ముఖేష్ అంబానీ, సుందర్ పిచాయ్‌ ఇంగ్లండ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే లండన్ స్పిరిట్ ది హండ్రెడ్ 2022లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.

మాంచెస్టర్‌పై 52 పరగుల తేడాతో లండన్ స్పిరిట్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన  లండన్ నిర్ణీత 100బంతుల్లో 6వికెట్లు కోల్పోయి 160పరుగులు చేసింది. లండన్ బ్యాటర్లలో  జాక్ క్రాలే(41), మోర్గాన్‌(37) కిరాన్‌ పొలార్ట్‌( 34) పరుగులతో రాణించారు. అనంతరం 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మాంచెస్టర్ ఒరిజినల్స్ 108 పరుగులకే కుప్పకూలింది. మాంచెస్టర్ బ్యాటర్లలో సాల్ట్‌ 36 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. లండన్ బౌలర్లలో జోర్డాన్ థాంప్సన్ నాలుగు వికెట్లతో చేలరేగగా.. మాసన్ క్రేన్,లియామ్ డాసన్ తలా రెండు వికెట్లు సాధించారు.


చదవండిCWG 2022: కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో ఓటమి.. ఇంగ్లండ్‌ హెడ్‌ కోచ్‌ సంచలన నిర్ణయం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement