రాజస్తాన్‌ రాయల్స్‌ అసిస్టెంట్ కోచ్‌గా షేన్ బాండ్‌.. | Rajasthan Royals Rope In Shane Bond As Fast Bowling And Assistant Coach | Sakshi
Sakshi News home page

IPL 2024: రాజస్తాన్‌ రాయల్స్‌ అసిస్టెంట్ కోచ్‌గా షేన్ బాండ్‌..

Oct 23 2023 2:50 PM | Updated on Oct 23 2023 3:13 PM

Rajasthan Royals Rope In Shane Bond As Fast Bowling And Assistant Coach - Sakshi

ఐపీఎల్‌-2024 సీజన్‌కు ముందు రాజస్తాన్‌ రాయల్స్‌ కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ పేసర్ షేన్ బాండ్‌ను రాజస్తాన్‌ ఫ్రాంచైజీ నియమించింది. షేన్ బాండ్‌ రాజస్తాన్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌ కోచ్‌గా మాత్రమే కాకుండా అసిస్టెంట్ కోచ్‌గా కూడా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా రాజస్తాన్‌ వెల్లడించింది.

కాగా ఈ క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో 9 సీజన్‌ల పాటు ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా పనిచేసిన బాండ్‌ను.. ముంబై ఫ్రాంచైజీ ఇటీవలే విడిచిపెట్టింది. ఐపీఎల్‌లో అత్యంత విజయంవతమైన టీమ్‌గా ముంబై ఇండియన్స్‌ను తీర్చిదిద్దడంలో షేన్ బాండ్ కీలక పాత్ర పోషించాడు. అతడి స్ధానంలో శ్రీలంక దిగ్గజం లసిత్‌ మలింగాను తమ బౌలింగ్‌ కోచ్‌గా ముంబై నియమించింది. అయితే గత రెండు సీజన్లలో రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలింగ్‌ కోచ్‌గా లసిత్‌ పనిచేయడం​ గమానార్హం​.
చదవండి: అదే మా కొంపముంచింది.. వారు మాత్రం అద్భుతం: న్యూజిలాండ్‌ కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement