డకౌట్ అయ్యానని ఆ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ నా చెంపపై కొట్టాడు: టేలర్‌

A Rajasthan Royals owner slapped me 3 4 times Says Ross Taylor - Sakshi

ఇటీవల న్యూజిలాండ్‌ క్రికెట్‌పై సంచలన ఆరోపణులు చేసిన ఆ జట్టు మాజీ ఆటగాడు రాస్‌ టేలర్‌.. తన ఆత్మకథ ద్వారా మరో దిగ్భ్రాంతికర సంఘటనను బయట పెట్టాడు. ఐపీఎల్‌ 2011 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ యజమాని తనను చెంపదెబ్బ కొట్టినట్లు టేలర్ తెలిపాడు.

కాగా గతంలో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో మూడేళ్లపాటు సేవలందించిన తర్వాత.. టేలర్‌ను 2011 వేలంలో రాయల్స్ 4.6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తను డకౌట్‌ అయ్యాక రాజస్థాన్‌ రాయల్స్‌ యజమాని ఒకరు తనపై  చేయి చేసుకున్నారని టేలర్‌ అన్నాడు. 

"మెహాలీ వేదికగా రాజస్తాన్‌ రాయల్స్‌- కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్లు తలపడ్డాయి. 195 పరుగుల లక్ష్య చేధనలో నేను డకౌట్‌గా వెనుదిరిగాను. మేము ఈ మ్యాచ్‌లో ఘోర ఓటమిని చవి చూసం. కనీసంలక్ష్యం దగ్గరకు కూడా చేరలేక పోయాం. మ్యాచ్‌ అనంతరం మా జట్టు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది అనంతరం హోటల్‌కు చేరుకున్నాము.

ఆ తర్వాత మేము అందరం‍ కలిసి హోటల్ పై అంతస్తులోని బార్‌కు వెళ్లాం. అక్కడ షేన్‌ వార్న్‌తో పాటు లిజ్ హర్లీ కూడా ఉంది. ఈ సమయంలో రాజస్తాన్‌ రాయల్స్‌ యాజమాని ఒకరు నా దగ్గరకు వచ్చారు. రాస్ నువ్వు డకౌట్‌ అయ్యేందుకు కాదు మేం నీకు మిలియన్ డాలర్లు చెల్లిస్తుందని అన్నాడు.

ఈ క్రమంలో అతడు నవ్వుతూ నా చెంపపై మూడు నాలుగు సార్లు కొట్టాడు. అయితే అతడు నన్ను గట్టిగా మాత్రం కొట్టలేదు. అతడు సరదాగా కొట్టాడో లేక ఉద్దేశ పూర్వకంగా చేశాడో నాకు తెలియదు. అప్పటి పరిస్థితుల్లో నేను దాన్ని పెద్ద సమస్య చేయదలుచుకోలేదు. కానీ జెంటిల్‌మెన్‌ గేమ్‌ పిలిచే క్రికెట్‌లో మాత్రం ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు.

ఆ సీజన్‌లో రాజస్తాన్‌ నన్ను భారీ ధరకు కొనుగోలుచేసినందు సంతోషంగా ఉన్నప్పటికీ.. ఈ సంఘటన జరిగాక ఆర్‌సీబీ నన్ను సొంతం చేసుకుని ఉంటే బాగున్ను అనిపించింది" అని  తన ఆత్మ కథ 'బ్లాక్‌ అండ్‌ వైట్‌'లో టేలర్ పేర్కొన్నాడు.
చదవండి: Ross Taylor About Racism: రాస్‌ టేలర్‌ సంచలన ఆరోపణలు.. కివీస్‌కున్న ట్యాగ్‌లైన్‌ ఉత్తదేనా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top