టీ20 ప్రపంచకప్-2026కు రంగం సిద్దమైంది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలగా ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది. అయితే ఈ టోర్నీలో పాకిస్తాన్ ఆడుతుందా? లేదా అన్నది? ఇంకా క్లారిటీ లేదు. ఓ వైపు వరల్డ్‌కప్ కోసం తమ జట్టును శ్రీలంకకు పంపేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వార్తలు వస్తుండగా.. మరోవైపు ప్రభుత్వ అనుమతి కోసం ఇంకా పీసీబీ ఎదురు చూస్తున్నట్లు ప్రచారం జరగుతోంది.
ఒకవేళ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఫిబ్రవరి 2న శ్రీలంకకు పాక్ పయనం కానుంది. అయితే ఈ మెగా టోర్నీ కోసం తమ కొత్త జెర్సీని ఆసీస్‌తో రెండో టీ20 సందర్భంగా విడుదల చేస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందుగా ప్రకటించింది. అయితే ఇప్పుడు తమ జెర్సీ కిట్ లాంచ్ కార్యక్రమాన్ని పీసీబీ రద్దు చేసింది.
ఇందుకు ప్రధాన కారణం పాక్ ప్రభుత్వం నుండి ఇంకా అనుమతి లభించకపోవడమేనని తెలుస్తోంది. పాక్ వరల్డ్‌కప్‌లో పాల్గొనడంపై తుది నిర్ణయం సోమవారం(ఫిబ్రవరి 2) వెలువడే అవకాశం ఉంది. కాగా ఈ మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ ఇప్పటికే తప్పుకొన్న సంగతి తెలిసిందే.
అయితే బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలుస్తూ పీసీబీ కూడా టోర్నీని బహిష్కరిస్తుమని ఉడత బెదరింపులకు దిగింది. కానీ ఐసీసీ జోక్యం చేసుకోవడంతో పీసీబీ వెనుక్కి తగ్గింది. కానీ టోర్నీలో పాల్గోనడంపై మాత్రం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. పాకిస్తాన్ ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతోంది.
వరల్డ్‌కప్ టోర్నీకి పాక్ జట్టు ఇదే
సల్మాన్ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ ఆజం, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, ఖవాజా నఫే, మహ్మద్ నవాజ్, సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, షాహీన్ షా ఆఫ్రిది, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఉస్మాన్ తారీక్


