ఐపీఎల్-2026లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ ఎట్టకేలకు తన బ్యాట్‌ను ఝూళిపించాడు. సోమవారం ఏకానా స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన పూరన్.. తన తుఫాన్ బ్యాటింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 16 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తం 21 బంతులు ఎదుర్కొన్న 8 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 63 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో పూరన్ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ఐపీఎల్ చరిత్రలో 20 కంటే తక్కువ బంతుల్లో అత్యధిక సార్లు హాఫ్ సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా పూరన్ నిలిచాడు. పూరన్ ఇప్పటివరకు 5 సార్లు 20 కంటే తక్కువ బాల్స్‌లోనే ఐదు సార్లు ఈ ఫీట్ సాధించాడు. ఇంతకముందు ఈ రికార్డు వైభవ్ సూర్యవంశీ(4) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో వైభవ్‌ను పూరన్ అధిగమించాడు. ఈ జాబితాలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ అభిషేక్ శర్మ(6) అగ్రస్ధానంలో ఉన్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే..లక్నోపై 6 వికెట్ల తేడాతో ముంబై ఘన విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యాన్ని ముంబై కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.4 ఓవర్లలో ఊదిపడేసింది. ఈ విజయంలో ఓపెనర్లు ర్యాన్ రికెల్టన్(83), రోహిత్ శర్మ(84) కీలక పాత్ర పోషించారు.
చదవండి: 'ఐపీఎల్‌లో ఆడడం కాదు.. అక్కడ ఆడితేనే గ్రేట్'


