రిటైర్మెంట్‌ ప్రకటించిన స్టార్‌ క్రికెటర్‌..12 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌ బై!

New Zealand pacer Neil Wagner retires from international cricket - Sakshi

న్యూజిలాండ్‌ వెటరన్‌ పేసర్‌ నీల్ వాగ్నర్  సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వాగ్నర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు  రిటైర్మెంట్ ప్రకటించాడు. స్వదేశంలో ఫిబ్రవరి 29 నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌ అనంతరం వాగ్నర్ ఇంటర్ననేషనల్‌ క్రికెట్‌ నుంచి తప్పుకోనున్నాడు. 

తన రిటైర్మెంట్‌ విషయంపై వాగ్నర్‌ మాట్లాడుతూ.. బ్లాక్‌ క్యాప్స్‌ తరపున అత్యున్నత స్ధాయిలో ప్రాతినిథ్యం వహించడం నాకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నాను. కివీస్‌ తరపున టెస్ట్ క్రికెట్ ఆడిన ప్రతి ఒక్క క్షణాన్ని ఆస్వాదించాను. కానీ కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చే సమయం అసన్నమైంది. అందుకే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాను.

ఆసీస్‌తో సిరీస్‌ అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలకనున్నాను. నా 12 ఏళ్ల జర్నీలో  మద్దతుగా నిలిచిన న్యూజిలాండ్‌ క్రికెట్‌కు, సహచరలకు, అభిమానులకు ధన్యవాదాలు" అంటూ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు.

ఈ విషయాన్ని న్యూజిలాండ్‌ క్రికెట్‌ కూడా ధృవీకరించింది. కాగా 2012లో వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో కివీస్‌ తరపున అరంగేట్రం చేసిన వాగ్నర్‌ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తుంపు తెచ్చుకున్నాడు. వాగ్నర్‌ కేవలం టెస్టుల్లో మాత్రమే న్యూజిలాండ్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో 64 టెస్టులు ఆడిన 37 ఏళ్ల వాగ్నర్‌.. 260 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఐదో కివీస్‌ బౌలర్‌గా వాగ్నర్‌ కొనసాగుతున్నాడు.

అదే విధంగా వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌-2021ను కివీస్‌ కైవసం చేసుకోవడంలో నీల్‌ది కీలక పాత్ర. కాగా దక్షిణాఫ్రికాకు చెందిన వాగ్నర్‌ 2008లో న్యూజిలాండ్‌కు తన మకాంను మార్చాడు. ఈ క్రమంలో దేశీవాళీ క్రికెట్‌లో ఒటాగో వోల్ట్స్‌, నార్తరన్‌ డిస్ట్రిక్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అనంతరం ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అదరగొట్టడంతో కివీస్‌ తరపున వాగ్నర్‌ అరంగేట్రం చేశాడు.
 

whatsapp channel

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top