ఇదేం చెత్త కెప్టెన్సీ బాబు.. రోహిత్‌కు ఇచ్చేయ్‌!లేదంటేనా? | Netizens Trolling On Hardik Pandya Captaincy During MI Vs RR Match | Sakshi
Sakshi News home page

#Hardik Pandya: ఇదేం చెత్త కెప్టెన్సీ బాబు.. రోహిత్‌కు ఇచ్చేయ్‌!లేదంటేనా?

Apr 1 2024 11:16 PM | Updated on Apr 2 2024 10:18 AM

Netizens Trolling On Hardik Pandya Captaincy On Mi Vs - Sakshi

ఐపీఎల్‌-2024లో ముంబై ఇండియన్స్‌ వరుసగా మూడో ఓటమి చవి చూసింది. వాంఖడే వేదికగా రాస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ముంబై ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ పరంగా ముంబై దారుణంగా విఫలమైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై ఇండియన్స్‌ రాజస్తాన్‌ బౌలర్ల దాటికి గజగజలాడింది.

రాజస్తాన్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌, స్పిన్నర్‌ చాహల్‌ చెరో మూడు వికెట్లలో ముంబైని దెబ్బతీయగా.. బర్గర్‌ రెండు, అవేష్‌ ఖాన్‌ ఒక్క వికెట్‌ సాధించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 9 వికెట్లు కోల్పోయి కేవలం 125 పరుగులు మాత్రమే చేసింది. ముంబై బ్యాటర్లలో హార్దిక్‌ పాండ్యా(34) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. తిలక్‌ వర్మ 32 పరుగులతో పర్వాలేదన్పించాడు.

అనంతరం 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ 15.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్తాన్‌ రాయల్స్‌ బ్యాటర్లలో రియాన్‌ పరాగ్‌(54 నాటౌట్‌) మరోసారి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక వరుసగా మూడో మ్యాచ్‌లోనూ ముంబై ఓటమి పాలవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ క్రమంలో ముంబై కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాను నెటిజన్లు మరోసారి దారుణంగా ట్రోలు చేస్తున్నారు. ఇక చాలు హార్దిక్‌ వెంటనే రోహిత్‌ శర్మకు కెప్టెన్సీ ఇచ్చే అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది సీజన్‌లో ముంబై సారథిగా బాధ్యతలు చేపట్టిన హార్దిక్‌ తన మార్క్‌ చూపలేకపోతున్నాడు.

ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ముంబై ఘెర ఓటములను చవిచూసింది. కెప్టెన్‌గా తన వ్యూహాలను అమలు చేయడంలో హార్దిక్‌ విఫలమవుతున్నాడు. ఈ క్రమంలోనే అతడిని ముంబై కెప్టెన్సీ నుంచి తప్పించి మళ్లీ రోహిత్‌ శర్మకు బాధ్యతలు అప్పజెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. లేదంటే ఈ ఏడాది సీజన్‌లో ముంబై ఒక్క మ్యాచ్‌లోనూ గెలవదంటూ పలువరు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement