
MS Dhoni: చెన్నై సూపర్ కింగ్స్ వెటరన్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనికి అడ్వర్టైజ్మెంట్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) అక్షింతలు వేసింది. ఐపీఎల్ 2022 సీజన్ ప్రచారంలో భాగంగా అతను బస్సు డ్రైవర్‌గా నటించిన ఓ ప్రోమో యాడ్ వివాదాస్పదమైంది. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ రూపొందించిన ఈ యాడ్ సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యింది.
When it's the #TATAIPL, fans can go to any extent to catch the action - kyunki #YehAbNormalHai!
— IndianPremierLeague (@IPL) March 4, 2022
What are you expecting from the new season?@StarSportsIndia | @disneyplus pic.twitter.com/WPMZrbQ9sd
అయితే, ఈ యాడ్‌పై రోడ్ సేప్టీ ఆర్గనైజేషన్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ASCIలో ఫిర్యాదు చేసింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అడ్వర్టైజ్మెంట్ కౌన్సిల్ యాడ్‌లో మార్పులు చేయాలని లేదా ఏప్రిల్ 20లోపు యాడ్‌ను తొలగించాలని ఆదేశించింది. దీంతో సదరు కంపెనీ యాడ్‌ని తొలగించేందుకే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే ధోని యాడ్ ఇకపై కనిపించకపోవచ్చు.
చదవండి: 'ధోని అలా చేసి ఉంటే ఫలితం వేరుగా ఉండేది'