Viral: MS Dhoni Expensive Gift To Sakshi Dhoni On Wedding Anniversary - Sakshi
Sakshi News home page

Dhoni Sakshi Wedding Anniversary: సాక్షికి ధోని సర్‌ప్రైజ్ గిఫ్ట్‌

Jul 4 2021 8:18 PM | Updated on Jul 5 2021 11:26 AM

Ms dhoni Gifted Wife Sakshi A Special Gift On Thier wedding anniversary

రాంఛీ: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని  అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయినప్పటికీ  అతని ఫాలోయింగ్‌ మాత్రం తగ్గట్లేదు. ఇక, రిటైర్ దగ్గర నుంచి.. ఫామ్ హౌస్ లో భార్య సాక్షి, కూతురు జీవాలతో సరదాగా గడిపేస్తున్నాడు.  మహేంద్ర సింగ్ ధోనీ, ఆయన భార్య  సాక్షి సింగ్‌ల వివాహ వార్షికోత్సవం నేడు.  2010లో  ప్రేమ పెళ్లి చేసుకుని ఒక్కటైన ఈ జంట దాంపత్యానికి 11 ఏళ్లు నిండాయి. వివాహ వార్షికోత్సవం సందర్భంగా తన సతీమణి సాక్షి సింగ్ కి  ధోని  ఓ మధురమైన బహుమతి ఇచ్చాడు.

సాక్షి కోసం స్పెషల్ గా ఓ వింటేజ్ కారును కొనుగోలు చేశాడు మహీ. లేత నీలం, వైట్ కలర్ కాంబినేషన్ లో ఉన్న కారును యానివర్సరీ కానుకగా ఇచ్చాడంటూ ఇన్‌స్టా స్టోరీలో సాక్షి సింగ్  పోస్టు చేసింది. ధోనీ..సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండడు. దీంతో సాక్షినే.. ధోనీ అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడూ సోషల్ మీడియా ద్వారా ధోని ఫ్యాన్స్‌కు షేర్ చేస్తుంటోంది. వీరిద్దరికీ జీవా ధోనీ అనే కూతురు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఐదేళ్ల జీవాకి ఇన్‌స్టాలో సెపరేట్ అకౌంట్ ఉండడమే కాదు, దాదాపు 2 మిలియన్ల ఫాలోవర్లు కూడా ఉన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement