
ఐపీఎల్-2022లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నైసూపర్ కింగ్స్ వికెట్ కీపర్ ఎంస్ ధోని అద్భుతమైన రనౌట్‌తో మెరిశాడు. పంజాబ్ ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో... భానుక రాజపక్స బౌలర్ దిశగా ఆడాడు. ఈ క్రమంలో పరుగు తీయడానికి రాజపక్స ప్రయత్నించాడు. అయితే నాన్‌స్ట్రెక్‌లో ఉన్న ధావన్ రాజపక్స పిలుపును తిరష్కరించడంతో అతడు మళ్లీ స్ట్రెక్ వైపు పరిగెత్తాడు.
ఈ నేపథ్యంలో జోర్డాన్ బంతిని అందుకుని వెంటనే వికెట్ కీపర్ ధోనికి విసిరాడు. అయితే ధోని డైవ్ చేస్తూ స్టంప్స్‌ను పడగొట్టి రనౌట్ చేశాడు. ధోని చేసిన రనౌట్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ నెటిజన్ స్పందిస్తూ.. "సూపర్ ధోని.. అద్భుతంగా రనౌట్ చేశావు" అంటూ కామెంట్ చేశాడు. మరో యూజర్.. "ఏంటి ధోని ఈ వయస్సులో కూడా.. సూపర్ రనౌట్' అంటూ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2022: 'ఏంటి మయాంక్ ఇలా ఆడుతున్నావు.. ఇక కష్టమే'
Brilliant run-out from Dhoni pic.twitter.com/FLSdRIPH31
— That-Cricket-Girl (@imswatib) April 3, 2022