‘రోహిత్‌ శర్మను రెండు రకాలుగా బౌల్డ్‌ చేస్తా’

Mohammad Amir: Bowling To Rohit Sharma Easy Out Both Ways - Sakshi

పరిమిత ఓవర్లలో లెఫ్టార్మ్‌ పేసర్లను ఎదుర్కోవడంలో భారత జట్టు ఓపనర్‌ రోహిత్‌ శర్మ ఇబ్బంది పడతాడని పాక్‌ మాజీ బౌలర్‌ మహ్మద్‌ అమిర్‌ అన్నాడు. టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మలకు బౌలింగ్‌ చేయడాన్ని తాను ఎక్కువగా ఇష్టపడతానని అమిర్‌ పేర్కొన్నాడు. ఆ ఇద్దరితో కలిసి క్రికెట్‌ ఆడాలని అనుకుంటున్నాని పేర్కొన్న అమిర్‌.. వారిద్దరూ పాకిస్తాన్‌ ప్రీమియర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో ఆడితే ఆ మజానే వేరుగా ఉంటుందన్నాడు.

కోహ్లితో పోలిస్తే రోహిత్‌కు బౌలింగ్‌ చేయడం సులభమని పేర్కొన్నాడు. కోహ్లి ఒత్తిడిలో మెరుగ్గా రాణిస్తాడని తెలిపాడు. అయితే ఈ క్రమంలో వారిద్దరికి బౌలింగ్‌ చేయడం ఎప్పుడూ కఠినంగా అనిపించలేదని చెప్పుకొచ్చాడు. రోహిత్‌ను తాను ఇన్‌ స్వింగ్‌, ఔట్‌ స్వింగ్‌తో ఔట్‌ చేయగలనని తెలిపాడు ఈ మాజీ పాకిస్తానీ బౌలర్‌. ఇక 2017లో జరిగిన చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో అమిర్‌ పాకిస్తాన్‌ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

పాకిస్తాన్‌ నిర్దేశించిన 339 పరుగుల టార్గెట్‌లో రోహిత్‌, ధావన్‌, కోహ్లిలనే ఆరంభంలోనే ఔట్‌ చేసి అమిర్‌ దెబ్బ కొట్టాడు. దాంతో ఫైనల్‌ మ్యాచ్‌లో పరాజయం పాలైన కోహ్లి సేన.. రన్నరప్‌గానే సరిపెట్టుకుంది. ఇటీవల జట్టు యాజమాన్యం తన పట్ల ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా మహ్మద్‌ ఆమిర్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.

చదవండి: ఈ హైదరాబాదీ భవిష్యత్తులో ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తాడు..

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top